పవన్ ట్వీట్: కాళ్లకు ఇసుక బస్తాలతో సీఎం జగన్

జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుంచి ఏపీ సీఎం జగన్ పై ట్విట్టర్ ద్వారా విమర్శలకు దిగారు. సీఎం కాళ్లకు ఇసుక బస్తాలు కట్టుకొని నడుస్తున్న ఫోటోను పోస్టు చేశారు. ఢిల్లీలో జగన్‌పై ఇలాంటి అభిప్రాయమే ఉందన్నారు. దాంతో పాటు ‘175 అసెంబ్లీ స్థానాలున్న అం.ప్ర – అసెంబ్లీ లో 151 అసెంబ్లీ స్థానాలలో ప్రజలు గెలిపిస్తే , వచ్చిన ఐదు నెలలు లోనే 35 లక్షల భవన నిర్మాణ కార్మికుల ఉపాధి ని తీసివేసి -ఏభై మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయేలా చేసిన ఘనత వైసీపీకే దక్కింది’అని రాసుకొచ్చారు. 

మరో ట్వీట్ లో ఎకనామిక్ టైమ్స్ ఎడిటోరియల్ కాలమ్ లోఉణ్న వ్యాసాన్ని పోస్టు చేశారు. జగన్ రెడ్డి చెడ్డ రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శలకు దిగారు. ఆ వ్యాసంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో అమరావతిలోని నిర్మాణదశలో ఉన్న ప్రాజెక్టులు ఆగిపోవడం వల్ల నగరాభివృద్ధికి చేటు వస్తుందని పేర్కొన్నాడు. సీఎం ఈ విషయంలో పునరాలోచించాలని సూచించాడు. 

సింగపూర్ నుంచి ప్రాజెక్టు వెనక్కివెళ్లిపోవడం పట్ల నిరాశను వ్యక్తం చేస్తూ సీఎం జగన్ మరో సారి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పాలన అనుసరించాలని చెప్పుకొచ్చాడు. భారతదేశంలో వేగవంతంగా నగరాభివృద్ధి జరుగుతుందని ఇటువంటి దశలో ఇలాంటి తగవని హితవు పలికాడు.