Paytm
Paytm : భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ప్రజలు పిట్టల్లారాలిపోతున్నారు. ఆక్సిజన్ అందక ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. వైరస్ కు చెక్ పెట్టేందుకు కేంద్రం వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చింది. వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో ఇన్ఫెక్షన్ రేటు చాలా తక్కువగా ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన వారు తప్పకుండా ఆరోగ్య సేతు, కోవిన్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.
మొదటి డోస్ వేయించుకున్న 45 ఏళ్లకు పైబడిన వారు కూడా స్లాట్ తప్పనిసరిగా బుక్ చేసుకోవాలని సర్కార్ స్పష్టం చేస్తోంది. అయితే.. చాలా రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత వేధిస్తోంది. దీంతో ప్రజలు వ్యాక్సిన్ దొరక్క అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ పేమెంట్స్ యాప్క..పేటీఎం..కీలక ఫీచర్ తీసుకొచ్చింది. కోవిడ్-19 వ్యాక్సిన్ స్లాట్స్ గురించి ట్రాక్ చేయవచ్చు. ఎక్కడ వ్యాక్సిన్ స్లాట్లు ఖాళీగా ఉన్నాయో తెలుసుకోవచ్చు. స్లాట్లు అందుబాటులోకి వచ్చిన సమయంలో నోటిఫికేషన్లను కూడా పొందే అవకాశాన్ని పేటీఎం అందిస్తోంది.
ఎలా చేసుకోవాలి : –
* PTM యాప్ ను ఓపెన్ చేయాలి.
* స్క్రోల్ చేసిన తర్వాత…’Vaccine Finder’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి.
* Search by PIN Code, Search by District ఆప్షన్లు కనిపిస్తాయి.
* దీని ఆధారంగా సెర్చ్ చేసుకోవచ్చు.
* పిన్ కోడ్ ను నమోదు చేయాలి. కింద Age Group విభాగంలో 18-44, 45+ రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. మీ వయస్సు ఆధారంగా ఈ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి.
* Check Availability ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
* స్లాట్ల వివరాలు కనిపిస్తాయి. స్లాట్లు ఖాళీగా లేకపోతే అక్కడ కనిపించే…Notify me when slots are availble ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. స్లాట్లు ఎప్పుడు * అందుబాటులోకి వస్తే..అప్పుడు పేటీఎం నోటిఫికేషన్ పంపిస్తుంది.
* ‘Search by District’ ఆప్షన్ ను ఎంచుకుంటే ముందుగా స్టేట్, తర్వాత జిల్లాను ఎంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత మిగతా ప్రక్రియ సేమ్ గానే ఉంటుంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే…రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ ను కేవలం ఆరోగ్య సేతు, కోవిన్ వెబ్ సైట్ ద్వారానే చేసుకోవచ్చు. పేటీఎం నుంచి వ్యాక్సిన్ కోసం స్లాట్ బుక్ చేసుకునే అవకాశం లేదు.