దేశంలో అతిపెద్ద మొబైల్ చెల్లింపుల ప్లాట్ ఫాం అయిన పేటీఎం.. వినియోగదారులకు ఇకపై తెలుగులోనూ సేవలందించనుంది. తెలుగుతో సహా మొత్తం పది ప్రాంతీయ భాషల్లో (ఆంగ్లం, హిందీ, గుజరాతీ, తెలుగు, మరాఠీ, బెంగాలీ, ఒరియా, తమిళ్, కన్నడ ) ఇలా విభిన్న భాషల్లో పేటీఎంను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా కస్టమర్లు తమ సొంత భాషలో లావాదేవీలు నిర్వహించే అవకాశం లభిస్తుందని పేటీఎం పేర్కొంది. దేశీయంగా ఇన్ని భాషల్లో సేవలు అందిస్తున్న తొలి డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం పేటీఎం ఒక్కటేనని తెలిపింది.
ఈ కార్యాకలాపాలు ప్రారంభించిన ఐదేళ్లలోపే దాదాపు 88 శాతం గ్రామాలను కవర్ చేశామని, మొత్తం వినియోగదారుల్లో 60 శాతానికి మించి సెకండ్, తార్డ్ గ్రేడ్ నగరాలకు చెందినవారేనని పేటిఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ అబాట్ తెలిపారు. ఇప్పుడు ప్రాంతీయ భాషల్లోనూ సేవలు అందిస్తుండటం వల్ల పేటీఎం కస్టమర్ల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. వచ్చే మార్చి చివరికల్లా వీరి సంఖ్యను 50 లక్షలకు పెంచుకోవాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read : తల్లి పడరాని పాట్లు: కొడుకు కోసం కాలేజీల్లో అమ్మాయిల వేట
Also Read : తండ్రి శవానికి ఐపీఎస్ ఆఫీసర్ నెలరోజులుగా చికిత్స
Also Read : మనోళ్లకే ఫస్ట్ ప్రైజ్: మంచుతో మహావిష్ణు శిల్పం
Also Read : ఎంతో టేస్టీ: ఆయుర్వేదిక్ ఐస్ క్రీం.. రుచి చూడాల్సిందే
Also Read : ఫిబ్రవరిలోనే లాంచ్ : ‘రెడ్ మీ నోట్ 7’ వచ్చేస్తోంది
Also Read : ZOMATO CHAT: అమ్మతోడు సార్.. మీ డబ్బులు వచ్చేస్తాయ్