ఏసీ గదుల్లో ఉండే వాళ్లకేం తెలుసు రూ.6వేలు విలువ: మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతుల వార్షిక ఆధాయ పథకంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ‘ఢిల్లీలోని ఏసీ గదుల్లో కూర్చుని కబుర్లు చెప్పేవారికి ఏం తెలుస్తుంది రూ.6వేల విలువ’ అని ప్రశ్నించారు. కొద్ది రోజుల్లో జరగనున్న సాధారణ ఎన్నికల సందర్భంగా మోడీ ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అందులో రైతులకు సంవత్సరానికి రూ.6వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు పేర్కొంది. అయితే ఈ ఆర్థిక సహాయంపై విమర్శలు గుప్పించిన ప్రతిపక్షాలపై మండిపడ్డ మోడీ.. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద రైతులకు ఈ డబ్బు ఎంతటి ఆసరాగా ఉంటుందో ఏసీ గదుల్లో ఉండి కబుర్లు చెప్పే వారికి తెలియదని బదులిచ్చారు. 

కశ్మీర్‌లోని ‘లే అండ్ లడక్’ ప్రాంతంలో కార్యక్రమాన్ని ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగించారు. ఈ పథకం ద్వారా రైతులు ఆర్థికంగా లభ్ది పొందుతారని ముఖ్యంగా లే అండ్ లడక్ ప్రాంతవాసులకు ఇది మరింతగా ఉపయోగపడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. 

ఆయన బీజేపీ కార్యకర్తగా ఉన్న సమయంలో లే ప్రాంతం నుంచే కూరగాయలను ఢిల్లీకి దిగుమతి చేసుకునే వాళ్లమని తెలిపారు. లడఖ్ ప్రాంతంలో తొలి యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరైయ్యారు.