Giant wheel : నవరాత్రి వేడుకల్లో జెయింట్ వీల్‌లో చిక్కుకుపోయిన 50 మంది .. తరువాత ఏమైందంటే..

 ఢిల్లీలో నవరాత్రి మేళాలో నిర్వహిస్తున్న ఓ జెయింట్ వీల్ లో 50మంది చిక్కుకుపోయారు.

Delhi Navratri Mela

giant wheel stops rotating at Delhi Navratri Mela : ఢిల్లీలో నవరాత్రి మేళాలో నిర్వహిస్తున్న ఓ జెయింట్ వీల్ లో 50మంది చిక్కుకుపోయారు. నగరంలోని నరేలా ప్రాంతంలో బుధవారం (అక్టోబర్ 18,2023) నవరాత్రి వేడుల్లో భాగంగా నిర్వహిస్తున్న మేళాలో జెయింట్ వీల్ వంటి పలు వినోదాలు ఏర్పాటు చేశారు. దీంట్లో భాగంగా జెయింట్ వీల్ ఎక్కి తిరుగుతున్న సమయంలో టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చి సడెన్ గా ఆగిపోయింది. దీంతో వారంతా భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.

ఢిల్లీలో నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నారు. ఈ వేడుకల్లో పలు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న పలువురు అక్కడే ఉన్న జెయింట్ వీల్ ఎక్కారు. ఈ క్రమంలో రాత్రి 10.30 గంటల సమయంలో టెక్నికల్ సమస్యతో జెయింట్ వీల్ నిలిచిపోయింది. దీంతో జెయింట్ వీల్ లో చిక్కుకున్న 50 మంది భయపడిపోయారు. అరగంటపైగా గాల్లో ఉండిపోయారు.

ఈ సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు అందరినీ సురక్షితంగా కిందకు దించారు. సందర్శకుల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించిన మేళా నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.