‘ఫోని’ తుఫాన్ : పూరి భక్తులను తరలించేందుకు స్పెషల్ ట్రైన్ 

  • Publish Date - May 2, 2019 / 06:52 AM IST

భువనేశ్వర్ : ‘ఫోని’ తుఫాన్ తీవ్ర రూపం దాల్చింది. ఈ ప్రభావం ఒడిశా రాష్ట్రంపై తీవ్రంగా పడనుందని వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కాగా ఒడిశా రాష్ట్రంలో పూరీ జగన్నాథ్ దేవాలయానికి భక్తులు భారీగా తరలి వస్తుంటారు. ఈ దేవాలయం  బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీ పట్టణంలోనే ఉంటుంది. ప్రాచీన..ప్రముఖ దేవాలయం కావటంతో భక్తులు ఇతర రాష్ట్రాల నుండే గాక విదేశాల నుంచి కూడా భక్తులు  విశేషంగా వస్తుంటారు. ఈ క్రమంలో పూరి పుణ్యక్షేత్రానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చారు. 
Also Read : ఫోని తుఫాన్ : ఉత్తరాంధ్రలో ముందుకొచ్చిన సముద్రం

ఫోని తుఫాను తీవ్రత ప్రభావంతో భక్తులకు ఎటువంటి ప్రమాదం గానీ, ఇబ్బందులు గానీ ఏర్పడకూడదనే ఉద్ధేశ్యంతో భక్తులను పూరి నగరంలో ఉన్న భక్తులను వారి స్వస్థలాలకు తరలించేందుకు గురువారం (మే 2)న  రైల్వేఅధికారులు ప్రత్యేక రైలు నడపేందుకు సిద్ధమయ్యారు. కాగా తుఫాన్ హెచ్చరికలతో ముందుజాగ్రత్త చర్యగా 103 రైళ్లను రద్దు చేశారు. మరో రెండు రైళ్లను దారి మళ్లించారు. దీంతో పూరి నగరంలో పెద్ద ఎత్తున పర్యాటకులు నిలిచిపోయారు.

ఫోని పెనుతుపాను ముప్పు పొంచి ఉండటంతో భక్తులను నగరం నుంచి వెళ్లిపోవాలని ఒడిశా సర్కారు హెచ్చరికలు జారీ చేసింది. భక్తులు వెళ్లిపోయేందుకు వీలుగా రైల్వేశాఖ గురువారం మధ్యాహ్నం 3PM, 6Pm లకు  పూరి నుంచి బయలుదేరి ఖుర్దారోడ్డు, భువనేశ్వర్, కటక్, జైపూర్, కేందుఝర్ రోడ్డు, భాద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్‌ల మీదుగా షాలిమార్ కు నడపనున్నారు.