Odisha Train Accident Live Updates: వారిని వదలబోమని హెచ్చరించిన ప్రధాని మోదీ

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటికే 300కి పైగా మృతి చెందినట్లు అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. మూడు రైళ్లు ఢీకొనడం తీవ్ర విస్మయాన్ని కలిగిస్తోంది.

Odisha Train Accident : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన షాలిమార్-చెన్నై కోరమండల్ ఎక్స్‌ప్రెస్ (Coromandel Express) ప్రమాదంలో దాదాపు 300 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ప్రధాని మోదీ పరిశీలించారు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 03 Jun 2023 07:56 PM (IST)

    స్వల్ప గాయాలతో..

    రైలు ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన రంజిత్ అలీ ఏపీ వ్యక్తి తన సొంత ప్రాంతం తాడేపల్లిగూడెం చేరుకున్నారు. ప్రమాదం నుంచి బయటపడటం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.

  • 03 Jun 2023 07:27 PM (IST)

    ప్రమాదం నుంచి బయటపడి..

    ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరుకు చెందిన శ్రీకర్ బాబు అనే వ్యక్తి ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం నుండి బయటపడి సొంత ప్రాంతానికి చేరుకున్నారు. రైల్వే స్టేషన్లో శ్రీకర్ బాబుని చూసి ఆయన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

  • 03 Jun 2023 06:17 PM (IST)

    కఠినంగా శిక్షిస్తాం: మోదీ

    బాధితులను పరామర్శించాక మోదీ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనకు బాధ్యులు ఎవరైనా ఉంటే వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ప్రమాద ఘటన చాలా సీరియస్ విషయమని, అన్ని కోణాల్లోనూ విచారణ జరుగుతుందని తెలిపారు. ప్రమాద ఘటన చాలా బాధాకరమని అన్నారు.

  • 03 Jun 2023 05:24 PM (IST)

    క్షతగాత్రులను పరామర్శించిన మోదీ

    కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ తో కలిసి ప్రధాని మోదీ ఒడిశాలోని ఆసుపత్రికి చేరుకుని, బాధితులను పరామర్శించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

  • 03 Jun 2023 05:01 PM (IST)

    పాకిస్థాన్ ప్రధాని స్పందన

    “భారత్ లో జరిగిన రైలు ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని తెలుసుకుని దిగ్భ్రాంతి చెందాను. గాయాలపాలైన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ట్వీట్ చేశారు.

  • 03 Jun 2023 04:00 PM (IST)

    ప్రమాద స్థలిని పరిశీలించిన మోదీ

    ఒడిశాలోని బాలాసోర్ లో రైలు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ప్రధాని మోదీ పరిశీలించారు. ఆయన కటక్ లోని ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్నారు. మోదీ వెంట పలువురు నేతలు, అధికారులు ఉన్నారు.

  • 03 Jun 2023 03:26 PM (IST)

    రైలు ప్రమాదంపై ఒక ప్రయాణికుడి స్పందన

    ఇంత దారుణమైన సంఘటన ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని బిహార్ రాష్ట్రానికి చెందిన ఒక ప్రయాణికుడు అన్నాడు. ఈ దారుణ ప్రయాణం నుంచి బయటపడ్డ అతడు.. ప్రమాదం గురించి తన కుటుంబ సభ్యులకు ఇంకా చెప్పలేదని అన్నాడు. తాను బీహార్ నుంచి చెన్నై వెళ్తున్నానని, కానీ ఒక్కసారిగా రైలు ప్రమాదానికి గురైందని అన్నాడు.

  • 03 Jun 2023 03:13 PM (IST)

    రైలు ప్రమాద బాధితులకు రూ.5 లక్షల ఎక్స్‭గ్రేషియో ప్రకటించిన బెంగాల్

    బాలాసోర్ రైలు ప్రమాదంలోని బాధితులకు 5 లక్షల రూపాయల పరిహారం ఇస్తామని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే మృతుల కుటుంబాలకు ఈ మొత్తాన్ని ఇవ్వనున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కార్యాలయం శనివారం వెల్లడించింది. ఇక ప్రమాదంలో గాయపడిన వారికి ఒక లక్ష రూపాయల పరిహారం ఇవ్వనున్నారు.

  • 03 Jun 2023 03:10 PM (IST)

    రైలు ప్రమాద బాధితులను పరామర్శించిన ఒడిశా గవర్నర్

    బాలాసోర్ రైలు ప్రమాదంలో గాయపడిన వారిని ఒడిశా గవర్నర్ గణేష్ లాల్ పరామర్శించారు. బాలాసోర్, సోరోలో ఉన్న ప్రభుత్వ హెల్త్ సెట్లర్లకు వెళ్లిన ఆయన.. ప్రమాదం గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. అలాగే వారికి అందుతున్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. బాధితుల అవసరాలను తెలుసుకుని, వాటిని అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

  • 03 Jun 2023 03:05 PM (IST)

    ఈ శతాబ్దంలో ఇదే అతిపెద్ద ప్రమాదం.. మమత

    ఒడిశాలోని బాలాసోర్‭లో జరిగిన రైలు ప్రమాదం 21వ శాతాబ్దంలో అతిపెద్ద ప్రమాదమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ప్రమాద స్థలాన్ని ఆమె శనివారం మధ్యాహ్నం సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘‘కోరమాండల్ మంచి ఎక్స్‭ప్రెస్ రైలు. నేను మూడుసార్లు రైల్వే మంత్రిగా పని చేశాను. ఈ శతాబ్దంలో జరిగిన అతిపెద్ద ప్రమాదం ఇదే. దీనిపై అత్యున్నత విచారణ చేపట్టి రిపోర్టు ఇవ్వాలి’’ అని అన్నారు.

  • 03 Jun 2023 02:23 PM (IST)

    Triple Train Accident : ఘోర రైలు ప్రమాదంలో 300 మంది మృతి..ప్రధాని మోదీ రాక

    Triple Train Accident

    ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ లో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 300కి చేరుకుంది. ఈ ప్రమాదంలో 900 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి ఒడిశా రైలు ప్రమాద స్థలానికి బయలుదేరారు.రైలు ప్రమాద స్థలాన్ని, గాయపడిన వారిలో కొందరిని చేర్చిన ఆసుపత్రిని ప్రధాని మోదీ సందర్శించనున్నారు.ప్రధాని కటక్‌లోని ఆసుపత్రిని సందర్శించి అక్కడ రైలు ప్రమాద క్షతగాత్రులను పరామర్శించనున్నారు.

  • 03 Jun 2023 01:38 PM (IST)

    దుర్ఘటనపై మాయావతి విస్మయం..

    ‘‘నిన్న ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో దక్షిణ భారతదేశంలోని చెన్నై సెంట్రల్ కోరమాండల్‌తో సహా మూడు రైళ్లు జరిగిన ఘోర ప్రమాదం, ప్రాణనష్టం గురించి విని చాలా బాధపడ్డాను. వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి. ఈ ప్రగాఢ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ప్రకృతి వారందరికీ ప్రసాదిస్తుంది. ఈ ఘోర ప్రమాదాన్ని చాలా సీరియస్‌గా తీసుకుని కేంద్ర ప్రభుత్వం దీనిపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపి, మృతుల కుటుంబాలకు తగు ఆర్థిక సహాయం అందించి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి, వారి పునరుద్ధరణకు సహకరించాలని BSP డిమాండ్ చేస్తోంది’’ అని బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతి అన్నారు.

  • 03 Jun 2023 01:30 PM (IST)

    ఒడిశా వెళ్లడానికి ఇప్పుడే ఢిల్లీ నుంచి బయల్దేరిన మోదీ

    ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరి కాసేపట్లో ఒడిశాకు చేరుకోనున్నారు. బాలాసోర్ రైల్వే ప్రమాద స్థలాన్ని ఆయన ప్రత్యక్షంగా సందర్శించనున్నారు. ఈ విషయమై ఆయన ఇప్పుడే ఢిల్లీ నుంచి బయల్దేరినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ప్రమాద స్థలంలో పర్యటించిన అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సహా రైల్వే మంత్రి అశ్విణీ వైష్ణవ్ లతో ప్రత్యేకంగా చర్చించనున్నట్లు సమాచారం.

  • 03 Jun 2023 01:26 PM (IST)

    రెస్క్యూ ఆపరేషన్ పూర్తయింది.. అధికారికంగా ప్రకటించిన రైల్వేశాఖ

    మూడు రైళ్లు ఢీకొట్టుకున్న ప్రదేశంలో రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిందని కేంద్ర రైల్వే శాఖ అధికారికంగా తెలిపింది. ప్రస్తుతం పునరుద్ధరణ పనులు ప్రారంభమైనట్లు రైల్వే శాఖ పేర్కొంది. సహాయక చర్యల కోసం 200 అంబులెన్సులు, 50 బస్సులు, 45 మొబైల్ హెల్త్ యూనిట్లు ప్రమాద స్థలానికి అంతకు ముందు ప్రకటనలో రైల్వే మంత్రి అశ్విణీ వైష్ణవ్ పేర్కొన్నారు. మొత్తం 1,200 మంది సిబ్బందితో కూడిన బృందం సహాయక చర్యల్లో ఉందట. క్షతగాత్రులను బాలాసోర్‌లోని ఆసుపత్రి, కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజీకి తరలించారు. అనేక మంది వ్యక్తులు పట్టాలు తప్పిన కోచ్‌ల కింద చిక్కుకుపోయారు. స్థానికులు వారిని రక్షించడానికి అత్యవసర సేవల సిబ్బందికి సహాయం చేశారు.

  • 03 Jun 2023 01:20 PM (IST)

    ఒడిశా ప్రమాదంపై జపాన్ ప్రధానమంత్రి దిగ్భ్రాంతి

    బాలాసోర్ ప్రమాదంపై జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిందా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఎంతో మంది విలువైన ప్రాణాలను కోల్పోయి, గాయాలపాలైనారనే వార్త తనకు చాలా బాధ కలిగించిందని ఆయన అన్నారు. జపాన్ ప్రభుత్వం, ప్రజల తరపున ప్రాణాలు కోల్పోయిన వారికి, వారి కుటుంబ సభ్యులకు తమ హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని జపాన్ ప్రధానమంత్రి ప్రార్థించారు.

  • 03 Jun 2023 01:15 PM (IST)

    బాలాసోర్ రైల్వే ప్రమాదంపై కఠిన చర్యలు తీసుకోవాలన్న కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్

    ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన రైల్వే ప్రమాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆయన శనివారం మాట్లాడుతూ ‘‘ఒడిశాలో నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరం. ప్రభుత్వం దీనిపై అత్యున్నత వివచారణ చేపట్టి, బాధ్యుతలపై కఠిన చర్యలు తీసుకోవాలి. మరోసారి ఇలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని అన్నారు.

  • 03 Jun 2023 01:11 PM (IST)

    ప్రమాద స్థలానికి చేరుకున్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

    మూడు రైళ్లు ఢీకొట్టుకున్న ప్రమాద స్థలానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేరుకున్నారు. అనంతరం ప్రమాద స్థలంలో ఆమె పర్యటించనున్నారు.

  • 03 Jun 2023 01:08 PM (IST)

    రైల్వే ప్రమాదంపై ప్రధాని మోదీ అధ్యక్షతన హైలెవెల్ మీటింగ్

    ఒడిశాలో జరిగిన రైల్వే ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన హైలెవెల్ మీటింగ్ కొనసాగుతోంది. ఈ మీటింగుకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా రైల్వే శాఖ అధికారులు పలువురు హాజరయ్యారు. బాలాసోర్ దుర్ఘటనపై ఉన్నత విచారణకు ఆదేశించడమే కాకుండా, ఈ ప్రమాద నష్టనివారణపై తీసుకునే చర్యలపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు