Viral Video: ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహిస్తుండగా వచ్చిన అంబూలెన్స్.. తర్వాత ఏం జరిగిందంటే?

2022 నవంబర్ 9న కూడా హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. కంగ్రాలో ప్రధాని ర్యాలీగా వెళ్తుండగా అంబూలెన్స్ వచ్చింది

తన సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఇంతలో అదే రోడ్ లో ఒక అంబూలెన్స్ వచ్చింది. దీంతో ప్రధాని మోదీ కాన్వాయ్ పక్కకు తప్పుకుని అంబూలెన్స్ కు దారి ఇచ్చింది. ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా ఇలాగే జరిగింది. రాష్ట్ర రాజధాని గాంధీ నగర్ నుంచి అహ్మదాబాద్ వైపుకు రోడ్ షో నిర్వహిస్తుండగా సడెన్ గా ఒక అంబూలెన్స్ వచ్చింది. వెంటనే ప్రధాని కాన్వాయ్ దానికి దారి ఇచ్చింది.

2022 నవంబర్ 9న కూడా హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. కంగ్రాలో ప్రధాని ర్యాలీగా వెళ్తుండగా అంబూలెన్స్ వచ్చింది. అప్పుడు కూడా ప్రధాని కాన్వాయ్ పక్కకు తప్పుకుని అంబూలెన్స్ కి దారి ఇచ్చింది. ఇక వారణాసిలో 19 వేల కోట్ల రూపాయలతో చేపట్టనున్న అధికారిక కార్యక్రమాకు శంకుస్థాపన చేసేందుకు ఆదివారం ప్రధాని వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంలోనే అంబూలెన్స్ రావడం, ప్రధాని కాన్వాయ్ పక్కకు తప్పుకోవడం ఆసక్తికరంగా మారింది. నెటిజెన్లు ఈ వీడియోను షేర్ చేస్తూ ప్రధానిపై పొగడ్తలు కురిపిస్తున్నారు.

ఇది కూడా చదవండి: జైళ్లలో డ్రగ్స్‭పై తీవ్ర ఆరోపణలు.. రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సిద్ధూ ఛాలెంజ్