Shivmogga Airport: శివమొగ్గ ఎయిర్పోర్ట్ ప్రారంభించిన ప్రధాని మోదీ
తాజా ఎయిర్‌పోర్ట్‌తో కర్ణాటక రాష్ట్రంలో తొమ్మిది ఎయిర్‌పోర్ట్‌లు అయ్యాయి. బెంగళూరు, బళ్లారి, బెళగావి, కలబురిగి, మైసూరు, మంగళూరు (బెంగళూరు, మంగళూరు నగరాల్లో రెండు ఎయిర్‌పోర్టులు ఉన్నాయి)ల సరసన ఇప్పుడు తాజా ఎయిర్పోర్ట్ చేరింది. ఇక రాష్ట్ర రాజధానిలోని బెంగళూరులో ఉన్న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత అతిపెద్ద రన్ వే ఉన్న విమానాశ్రయం ఇదే.
- tony bekkal
- Published On : February 27, 2023 / 04:40 PM IST
PM Modi innagurates shivmogga airport, 9th one in karnatka
Shivmogga Airport: ఈ యేడాది చివర్లో ఎన్నికలు జరగనున్న కర్ణాటక రాష్ట్రంలో ఉన్న శివమొగ్గ ఎయిర్‌పోర్ట్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ప్రారంభించారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసరాజు బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సహా బీజేపీ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఎయిర్పోర్ట్ మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కలల ప్రాజెక్ట్. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎయిర్పోర్ట్ నిర్మాణానికి నిధులు తీసుకొచ్చినట్లు బీజేపీ వర్గాలు చెబుతుంటాయి.
Shashi Tharoor: శశి థరూర్ సభకు డిక్షనరీతో వచ్చిన ఓ వ్యక్తి.. తప్పేం లేదంటున్న నెటిజెన్లు
ఇక శివమొగ్గ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఎయిర్‌పోర్ట్‌కు కర్ణాటక కవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత కువెంపు పేరు పెట్టారు. ఈ విమానాశ్రయం గంటకు 300 మంది ప్రయాణికులను చేరవేస్తుందని తెలిపారు. శివమొగ్గ విమానాశ్రయాన్ని దాదాపు రూ. 449 కోట్లతో నిర్మించారు. విమానాశ్రయంలోని ప్యాసింజర్ టెర్మినల్ భవనం రోజుకు 7,200 మంది ప్రయాణీకులను నిర్వహిస్తుందని అధికారులు తెలిపారు.
Uttar Pradesh: ఉమేశ్ పాల్ హత్య కేసులో నిందితుడు ఎన్కౌంటర్లో హతం
కాగా, తాజా ఎయిర్‌పోర్ట్‌తో కర్ణాటక రాష్ట్రంలో తొమ్మిది ఎయిర్‌పోర్ట్‌లు అయ్యాయి. బెంగళూరు, బళ్లారి, బెళగావి, కలబురిగి, మైసూరు, మంగళూరు (బెంగళూరు, మంగళూరు నగరాల్లో రెండు ఎయిర్‌పోర్టులు ఉన్నాయి)ల సరసన ఇప్పుడు తాజా ఎయిర్పోర్ట్ చేరింది. ఇక రాష్ట్ర రాజధానిలోని బెంగళూరులో ఉన్న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత అతిపెద్ద రన్ వే ఉన్న విమానాశ్రయం ఇదే. మరో విశేషం ఏంటంటే, యడియూరప్ప పుట్టినరోజు అయిన ఈరోజే ఈ ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా యడియూరప్పకు మోదీ అభినందనలు తెలిపారు.
