Uttar Pradesh: ఉమేశ్ పాల్ హత్య కేసులో నిందితుడు ఎన్‭కౌంటర్‭లో హతం

ఉమేష్ పాల్ హత్యపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇప్పటివరకు అతిక్ బంధువులతో సహా 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఉమేష్ పాల్ హత్యకు ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలులో ఉన్న అతిక్ ఖాన్ కుట్ర పన్నాడని ఉత్తరప్రదేశ్ పోలీసులు భావిస్తున్నందున అతడిని ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు

Uttar Pradesh: ఉమేశ్ పాల్ హత్య కేసులో నిందితుడు ఎన్‭కౌంటర్‭లో హతం

Accused in Umesh Pal assassination case killed in encounter

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సమాజ్‭వాదీ పార్టీ నేత ఉమేష్ పాల్ హత్యా నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అర్బాజ్ అనే వ్యక్తి ఎన్‭కౌంటర్‭లో హతమైనట్లు యూపీ పోలీసులు సోమవారం తెలిపారు. ప్రయాగ్‭రాజ్‭లోని నెహ్రూ పార్క్ వద్ద స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, జిల్లా పోలీసుల తూటాలకు బలైనట్లు తెలిసింది. ప్రయాగ్‌రాజ్‌లో హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ వెనుక సీటు నుంచి దిగుతుండగా ఉమేష్ పాల్‌ను గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చంపారు. బుల్లెట్ గాయాల రక్తపు మడుగులో ఉన్న పాల్‌ను సమీపంలోని స్వరూప రాణి నెహ్రూ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. శవపరీక్ష నివేదికలో ఆయనను ఏడుసార్లు కాల్చినట్లు వెల్లడించింది.

By Polls: కఠిన భద్రత నడుమ నాలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉప ఎన్నికల పోలింగ్

హత్య అనంతరం ఉమేష్ పాల్ భార్య జయపాల్, పోలీసులను ఆశ్రయించి ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ సోదరుడు, భార్య సహిస్తా ప్రవీణ్, ఆయన కుమారులు అహ్జాన్, అబాన్‌తో పాటు పలువురిపై ఐపీసీ, పేలుడు పదార్థాల చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఉమేష్ పాల్ హత్య కేసులో బీజేపీ నేత రహీల్ హసన్ సోదరుడు గులామ్ పేరును చేర్చారు. బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే రాజ్ పాల్ హత్య కేసులో ఉమేష్ పాల్ ప్రధాన సాక్షి. అలహాబాద్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన కొద్ది నెలలకే రాజ్ పాల్ తీవ్ర హత్యకు గురయ్యారు.

Shashi Tharoor: శశి థరూర్ సభకు డిక్షనరీతో వచ్చిన ఓ వ్యక్తి.. తప్పేం లేదంటున్న నెటిజెన్లు

దాడి చేసిన వారి కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు 10 బృందాలను ఏర్పాటు చేశారు. సరిహద్దులు, బస్టాండ్‌లు, విమానాశ్రయంతో సహా ప్రయాగ్‌రాజ్‭కు వచ్చి పోయే అన్ని మార్గాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. ఉమేష్ పాల్ హత్యపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇప్పటివరకు అతిక్ బంధువులతో సహా 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఉమేష్ పాల్ హత్యకు ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలులో ఉన్న అతిక్ ఖాన్ కుట్ర పన్నాడని ఉత్తరప్రదేశ్ పోలీసులు భావిస్తున్నందున అతడిని ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. కాగా, ఉమేష్ పాల్ హత్య కేసులో సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ అతిక్ అహ్మద్ భార్య షైస్తా పర్వీన్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు. ప్రయాగ్‌రాజ్ పోలీస్ కమీషనర్ రమేష్ శర్మ, ఏడీజీ ఎస్‭టీఎఫ్ అమితాబ్ యాష్ ప్రత్యర్థులతో కుమ్మక్కయ్యారని, తన భర్త అతిక్ అహ్మద్ సహా అతిక్ తమ్ముడు అష్రఫ్‌లను హత్య చేయడానికి కాంట్రాక్టులు తీసుకున్నారని ఉమేష్ పాల్ భార్య ఆరోపించారు.