PM Modi Video : సోషల్ మీడియాలో ప్రధాని మోదీ పవర్.. ఒక్క వీడియోతో వరల్డ్ రికార్డు..

PM Modi Video : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.

pm modi instagram video 303 million views breaks world record

  • సోషల్ మీడియాలో ప్రధాని మోదీ పవర్..
  • ఒక్క ఇన్‌స్టా వీడియోతో వరల్డ్ రికార్డు..
  • ఫిఫా రికార్డునూ బ్రేక్‌ చేసిన మోదీ వీడియో

pm modi instagram video 303 million views breaks world record : సోషల్ మీడియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. నీట్ 2026 పేపర్ లీకేజీ అంశంపై విద్యార్థులను ఉద్దేశించి  మోదీ గురువారం అర్ధరాత్రి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందనను దక్కించుకుంది.

Also Read : Andhra Pradesh : ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. రూ. 71,602 కోట్ల పెట్టుబడులు.. 14250 మందికి ఉద్యోగావకాశాలు..

ఈ వీడియోతో ప్రధాని నరేంద్ర మోదీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు కేవలం 24 గంటల్లోనే సుమారు 10 లక్షల (1 మిలియన్) మంది కొత్త ఫాలోవర్లు చేరారు. అంతేకాదు, ఈ వీడియో విడుదలైన 24 గంటల్లోనే 303 మిలియన్ (30.3 కోట్ల) వ్యూస్ సాధించి కొత్త రికార్డు నెలకొల్పింది. మోదీ వీడియో సునామీతో.. 2026 ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా ప్రముఖ యూట్యూబర్ ‘ఐషో స్పీడ్’ వీడియో పేరిట ఉన్న 300 మిలియన్ వ్యూస్ రికార్డును మోదీ వీడియో అధిగమించింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో 10.2 కోట్ల (102 మిలియన్) ఫాలోవర్లతో ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన గ్లోబల్ లీడర్‌గా ప్రధాని మోదీ ఇప్పటికే కొనసాగుతున్నారు. తాజాగా పోస్టు చేసిన వీడియోతో  ఆయన సోషల్ మీడియా ప్రభావం మరింత పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

అర్ధరాత్రి విడుదల చేసిన ఈ వీడియోలో మోదీ తన ప్రసంగాన్ని ఫ్రెండ్స్.. అంటూ ప్రారంభించి, జెన్-జీ తరానికి దగ్గరయ్యే శైలిలో మాట్లాడారు. దీంతో ఆ వీడియో ఆధారంగా వేలాది మంది నెటిజన్లు రీల్స్, మీమ్స్ రూపొందిస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. యువతను ఆకట్టుకునేలా మోదీ అనుసరిస్తున్న కొత్త కమ్యూనికేషన్ విధానం విశేష ఆదరణ పొందుతోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ విడుదల చేసిన తొలి వీడియోకు విద్యార్థుల నుంచి విశేష స్పందన రావడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. వారికి కృతజ్ఞతలు తెలుపుతూ మరో వీడియోను కూడా విడుదల చేశారు. ఇక ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కూడా మంత్రులందరూ సామాజిక మాధ్యమాల్లో మరింత చురుకుగా ఉండాలని, ముఖ్యంగా యువతతో ప్రత్యక్షంగా మమేకమవుతూ ప్రభుత్వ కార్యక్రమాలను చేరవేయాలని ప్రధాని మోదీ సూచించినట్లు సమాచారం.