హోలీ వేడుకలకు మీరూ దూరంగా ఉండండి : మోడీ

  • Publish Date - March 4, 2020 / 06:55 AM IST

భారత్ లో కరోనా కేసులు నమోదు కావటంతో ఈ సంవత్సరం హోలీ పండుగ వేడుకల్లో తాను పాల్గొనటంలేదని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం (మార్చి 4,2020) తెలిపారు. కరోనా వైరస్ తో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారనీ.. ఈ క్రమంలో సామూహిక సమావేశాలకు కూడా తాను హాజరుకావటంలేదని ట్విట్టర్ వేదికగా తెలిపారు. 

కరోనా భయం వెన్నాడుతున్న క్రమంలో ప్రజలు కూడా సామూహికంగా జరిగే కార్యక్రమాలను..హోలీలకు దూరంగా ఉంటే మంచిదని ప్రజలు ఈ సందర్భంగా మోడీ సూచించారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండటానికి ప్రజలంతా ఇటువంటి వేడుకలకు దూరంగా ఉండాలని.. మాస్ సమావేశాలకు అంటే బహిరంగ సమావేశాలను తగ్గించాలని ప్రపంచ వ్యాప్తంగా నిపుణులు సూచించారని కాబట్టి ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

కాగా..చైనాలో వెలుగులోకి వచ్చి కరోనా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ఈ క్రమంలో భారతదేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటిదాకా 6 కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా జైపూర్‌లో ఇటాలియన్‌ టారిస్ట్‌కు వైరస్‌ సోకినట్లు తేలింది. దీంతో అతడ్ని ఐసోలేటెడ్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇక- ఢిల్లీలో కరోనా బాధితుడికి చికిత్స కొనసాగుతోంది.(లోక్‌పాల్ రిజెక్ట్ చేస్తే..వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు)

కరోనా వైరస్ వ్యాప్తి భయంతో నోయిడాలోని ఓ ప్రైవేటు పాఠశాలకు మూడ్రోజుల పాటు సెలవు ప్రకటించారు.