ఎవ్వరు అడ్డుకున్నా చేసి చూపించాం: మోడీ

సెప్టెంబర్ 17వ తేదీ తన 69వ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు వెళ్లారు. సర్దార్ సరోవర్ డ్యాం వద్ద ఉన్న నర్మద నదీ దేవతకు చేసిన పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇటువంటి ప్రాజెక్టు ప్రపంచంలోనే ఎక్కడా చూడలేదని ఇది ఇంజినీరింగ్‌లో అద్భుతమని కొనియాడారు. దీనిని భారతజాతికి అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

‘ఈ డ్యాం నిర్మాణంపై పలు అసత్య ఆరోపణలు ఉన్నాయి. చాలా మంది ఈ ప్రాజెక్టును ఆపేయడానికి ప్రయత్నించారు. దీన్ని రాజకీయం చేయదలచుకోలేదు. అందుకే వారి పేర్లు బయటపెట్టడం లేదు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద  ప్రాజెక్టును ఎన్నికల కోసమే రూపొందించామని చెప్తోన్న కాంగ్రెస్ పార్టీ వారందరికీ కౌంటర్ పార్ట్‌లా నిలిచింది. ఈ ప్రాజెక్టు గుజరాత్ మోడల్‌గా నిలుస్తుందనే నమ్మకముంది. ఇది పూర్తి అయితే ప్రజల స్థితిగతులు మారతాయని భావిస్తున్నా’ అని మోడీ వెల్లడించారు. 

ఈ ప్రాజెక్టు రాష్ట్రాల మధ్య అంతర్గత భేదాలను సృష్టించింది. భూ ఆక్రమణ, ప్రకృతి సమస్యలు, పునరావాసం వంటి ఆరోపణలన్నిటికీ సమాధానంగా నిలిచింది. డ్యాంకు వ్యతిరేకంగా నర్మదా బచావో ఆందోళనను కూడా నిర్వహించారు. మేధా పాట్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమం మధ్యలోనే ఆగిపోయింది.