ప్రధాని మోడీకి గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు ప్రదానం

  • Publish Date - September 25, 2019 / 04:18 AM IST

ప్రధాని నరేంద్ర మోడీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే.  దీనికి  ‘బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్’ మోడీకి ‘గ్లోబల్ గోల్ కీపర్’ అవార్డు ప్రదానం చేసింది. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ చేతుల మీదుగా ప్రధాని మోదీ ఈ అవార్డును అందుకున్నారు. 

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ… ఇది తన ఒక్కడికే దక్కిన గౌరవం కాదని…యావత్ భారతీయులందరిదీనని అన్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్ విజయవంతం కావడానికి కారణమైన  భారతీయులందరికీ ఈ గౌరవం దక్కుతుందని మోడీ అన్నారు. భారత జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలను  దేశవ్యాప్తంగా అక్టోబర్ 2న జరుపుకోనున్న ఈ  సంవత్సరంలోనే ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. 

గత ఐదు సంవత్సరాలలో దేశ వ్యాప్తంగా 11కోట్ల మరుగుదొడ్లు కట్టించినట్లు చెప్పారు. భారతదేశపు ఆడబిడ్డల ఆత్మగౌరం నిలబడేందుకు ఈ పథకం ఉపయోగిపడుతోందన్నారు.  మహిళలు, ఆడపిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని..రానున్న కాలంలో మరుగు దొడ్లు లేని ఇల్లు ఉండకూడదనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఏ ఆడబిడ్డ ఆత్మాభిమానం పోగొట్టుకోవకూడదనే ఉద్ధేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం స్కూల్స్ లో మరుగుదొడ్లు లేని కారణంగా బడికి వెళ్లడం మానివేసిన బాలికలు కూడా ఉన్నారని. మోడీ సందర్భంగా అన్నారు. మహాత్మాగాంధీ కలలు కన్న పరిశుభ్రమైన భారత్ ను అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని మోడీ అన్నారు.