PM Modi: మరో 100ఏళ్లు కాంగ్రెస్ అధికారంలోకి రాదు – పీఎం మోదీ

రాష్ట్రపతికి మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ప్రసంగంలో భాగంగా మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ ను...

Republic Day PM Modi

PM Modi: రాష్ట్రపతికి మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ప్రసంగంలో భాగంగా మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ ను మరో 100ఏళ్ల పాటు అధికారంలోకి రాకుండా చూసేందుకు తాను ప్రిపేర్ అయి ఉన్నానని అన్నారు.

‘ఇప్పుడు మీరు కూడా మరో 100ఏళ్లు అధికారంలోకి రాలేమని ఫిక్స్ అయిపోండి’ అని కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీని తిట్టిపోస్తూ.. కేంద్ర పథకాలను కాంగ్రెస్ ఎందుకని అడ్డుకుంటుందని ప్రశ్నించారు.

‘నన్ను వ్యతిరేకించవచ్చు. కానీ, ఫిట్ ఇండియా మూమెంట్, ఇతర స్కీంలను ఎందుకని వ్యతిరేకిస్తున్నారు? మీకు ఓట్లు చాలా ఏళ్లు గడిచాయని మర్చిపోవద్దు’ అని పీఎం మోదీ అన్నారు.

Read Also: పేకాటలో నలుగురు కింగ్స్.. ఈ ఆటలో ఒక్కడే కింగ్!

‘నాగాలాండ్ లో 24ఏళ్ల క్రితం, ఒడిశాలో 27ఏళ్ల క్రితం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గోవాలో పూర్తి మెజారిటీతో 28ఏళ్ల క్రితం గెలిచింది కాంగ్రెస్. త్రిపురలో గెలిచింది కూడా 1988లో. వెస్ట్ బెంగాలో లో 1972లో ఓట్లు దక్కించుకుంది కాంగ్రెస్. తెలంగాణ ఏర్పాటుకు క్రెడిట్ తీసుకోగలరేమో కానీ, ప్రజలు మిమ్మల్ని ఒప్పుకోరు’ బీజేపీ లీడర్ అన్నారు.

‘కాంగ్రెస్ చాలా రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. కానీ, వాళ్ల ఇగోతో పార్టీ ఇంకా అహంకారంతో నిండిపోయింది. చాలా ఎన్నికలు ఓడిపోయారు. ఇప్పటికీ అందులో మార్పు ఉంటుందని అనుకోం’ అని ప్రధాని వెల్లడించారు.