PM Narendra Modi : ప్రధాని మోడీ షేర్ చేసిన శాల్మలీ వీడియో.. చిన్నారి ప్రతిభకు ప్రధాని ఫిదా..
పట్టుమని పదేళ్లు కూడా లేవు. ఓ చిన్నారి పియానోపై తన వేళ్లను పరుగులు పెట్టించేస్తోంది. చిన్నారి పియానో వాయిస్తున్న వీడియోని చూసి ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసల జల్లు కురిపించారు.
- Lakshmi 10tv
- Published On : April 25, 2023 / 10:51 AM IST
PM Narendra Modi :
PM Narendra Modi : ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అన్న చందంగా చూడముచ్చటగా పియానో వాయిస్తోంది చిన్నారి శాల్మలీ. ఆమె పియానో వాయిస్తున్న వీడియో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ అవుతూ మోడీ దృష్టిని ఆకర్షించింది. శాల్మలీ ప్రతిభకు ముగ్ధులైన మోడీ ఆ వీడియోని తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసారు.
Namo App New Feature : మోడీతో దిగిన ఫోటో మిస్ అయ్యిందా? నమో యాప్‌లో దొరికేస్తుంది
‘పల్లవగల పల్లవియాలి’ అనే పాటకు ఎంతో అద్భుతంగా పియానో వాయిస్తున్న చిన్నారి శాల్మలీ వీడియో రీసెంట్‌గా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ పాటను కన్నడ కవి కేఎస్.నరసిహస్వామి రచించారు. ఒక లేడీ పాట పాడుతుంటే లైన్ బై లైన్ శాల్మలీ పియానోపై ట్యూన్ ప్లే చేసింది. ఈ బ్యూటిఫుల్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. ఈ వీడియోని చూసిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ‘ఈ వీడియో చూడగానే అందరి ముఖంలో చిరునవ్వు కదలాడుతుంది. ఈ చిన్నారిలో అసాధారణమైన ప్రతిభ దాగుంది. శాల్మలీకి శుభాకాంక్షలు’.. అంటూ మోడీ శాల్మలీని ఆశీర్వదించారు.
Narendra Modi : మోడీ మీద అభిమానంతో ఓ రైతు ఏం చేశాడంటే? వీడియో వైరల్
ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో దూసుకుపోతోంది. శాల్మలీకి మంచి భవిష్యత్ ఉందని… అందరూ ప్రశంలు కురిపిస్తున్నారు. తన ప్రతిభతో దేశ ప్రజలతో పాటు ప్రధానమంత్రి ప్రశంసలు పొందటమంటే నిజంగా అదృష్టమే మరి. శాల్మలీకి మనసారా అభినందనలు చెబుదాం.
This video can bring a smile on everyone’s face. Exceptional talent and creativity. Best wishes to Shalmalee! https://t.co/KvxJPJepQ4
— Narendra Modi (@narendramodi) April 25, 2023
