Modi to visit hyderabad
Modi to visit hyderabad: తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు క్యూ కట్టనున్నారు. వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి ప్రణాళికలు వేసుకుంది. కొత్త ఏడాదిలో ఏయే నియోజక వర్గాల్లో ఏయే కార్యక్రమాలు చేపట్టాలి? బీజేపీని ఎలా బలపర్చాలి? ఏయే నాయకులు ఏయే ప్రాంతాల్లో పర్యటించాలన్న విషయాలపై నిర్ణయాలు తీసుకుంది.
పార్లమెంటు నియోజక వర్గాల్లో సభలకు బీజేపీ ప్లాన్ వేసుకుంది. ఫిబ్రవరిలో హైదరాబాద్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. మార్చిలో తెలంగాణకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చి పలు సభల్లో పాల్గొంటారు. ఏప్రిల్ లో కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తారు. జనవరి నుంచి అనేక సభల నిర్వహణకు బీజేపీ ప్రణాళికలు వేసుకుంది.
కాగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ మిషన్-90 కార్యక్రమం ప్రారంభించింది. ఇందులో భాగంగా నిన్న శామిర్ పేటలో కన్వీనర్, విస్తారక్, పాలక్ ల సమావేశంలో బీజేపీ శ్రేణులకు ఆ పార్టీ నాయకులు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో 119 నియోజక వర్గాలకు పాలక్ లను నియమించారను. వారు తమకు కేటాయించిన నియోజక వర్గాల్లో ఒక్కో నెలలో మూడు రోజుల పాటు ఉంటారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తారు.
Chandrababu Naidu: సీఎం జగన్‌కు త్వరలోనే రిటర్న్ గిఫ్ట్: చంద్రబాబు నాయుడు