Pm Modi
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకే బుధవారం ఆయా రాష్ట్రాల ఎంపీలతో ప్రధాని నివాసంలో ఉదయం 9:30 గంటలకు ఎంపీలతో అల్పాహార విందు భేటీ కానున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని తాజా రాజకీయ పరిస్థితులపై ఎంపీలతో చర్చించనున్నారు.
పార్లమెంట్ సమావేశాల సందర్భంగా వివిధ రాష్ట్రాల ఎంపీలతో మోడీ సమావేశం ఆనవాయితీగా వస్తుంది. రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం, కేంద్ర పథకాలను జనాల్లోకి తీసుకువెళ్లడం అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ సమావేశానికి ఏపీ నుంచి జీవిఎల్, సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్ లు పాల్గొంటుండగా.. తెలంగాణ నుంచి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు హాజరుకానున్నారు.
……………………………. : కమల్‌తో సీఎం కేసీఆర్ భేటీ ?
పార్లమెంట్ సమావేశాల ప్రారంభం (నవంబర్ 29) రోజు నిబంధనలు ఉల్లంఘించినందుకు రాజ్యసభ చైర్మన్ 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ విధించారు. ఇన్నాళ్లు రైతు సమస్యలపై దద్దరిల్లిన ఉభయ సభలు.. ఇప్పుడు 12 మంది ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేయాలని ప్రతిపక్ష పార్టీలు సభలో గందరగోళం సృష్టించాయి. ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలోనే రాజ్య సభ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి.