Abhijeet Dipke Arrest: ఢిల్లీలో ‘చలో సంసద్’ ఉద్రిక్తత.. అభిజీత్ దీప్కే అరెస్ట్
Abhijeet Dipke: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- V Santhosh Kumar
- Updated on- July 20, 2026 / 05:27 PM IST
Police Arrest Abhijeet Dipke due to Chalo Sansad Protest
- ఢిల్లీలో తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం
- అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్నారు
- పార్లమెంట్ ముట్టడికి యువత యత్నం
Abhijeet Dipke Arrest: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే(Abhijeet Dipke)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష ముగించిన అనంతరం వేలాది మంది యువతతో కలిసి పార్లమెంట్ వైపు దూసుకెళ్తున్న ‘చలో సంసద్’ ర్యాలీని అడ్డుకునే క్రమంలో ఈ అరెస్ట్ జరిగింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ముందడుగు వేస్తున్న నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు లాఠీఛార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
యువతపై పోలీసుల లాఠీఛార్జ్‌ను నిరసిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో ప్రశ్నించడంతో పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించగా, సీజేపీ ప్రతినిధుల బృందం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చలకు వెళ్లింది. ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారీగా పారామిలటరీ బలగాలను మోహరించారు.
