Manipur News: మణిపూర్‭లో మందుగుండుతో పోలీసులకు పట్టుబడ్డ ఎమ్మెల్యే మేనల్లుడు

నిషేధిత సంస్థ 'కాంగ్లీ యావోల్ కనా లూప్' (కేవైకేఎల్)లో క్రియాశీలక సభ్యుడిని అరెస్టు చేసినట్లు మణిపూర్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. అతని నుంచి 9 ఎంఎం బెరెట్టా యుఎస్ కార్ప్ పిస్టల్, ఏడు రౌండ్లు, దోపిడీ డబ్బును స్వాధీనం చేసుకున్నారు

Manipur News: మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ఆయుధాలు, మందుగుండు సామగ్రితో ఒక వ్యక్తి(45) అరెస్టు అయ్యారు. అనంతరం విచారణ చేయగా.. ఆ వ్యక్తి మణిపూర్ ఎమ్మెల్యే మేనల్లుడు అని తేలింది. పోలీసుల విచారణపై అవగాహన ఉన్న అధికారులు ఆదివారం ఈ సమాచారం ఇచ్చారు. మణిపూర్‌లో మే నెల నుంచి హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. కొన్నిసార్లు హింసాత్మక సంఘటనలు తగ్గుముఖం పట్టినట్టే పట్టి, మళ్లీ పెద్ద ఎత్తున చెలరేగుతున్నాయి.

హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం.. అనుమానిత ఉగ్రవాది జూన్ నుంచి మయన్మార్‌లో ఉన్న ఉగ్రవాద సమూహంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అనుమానిత ఉగ్రవాది కుల హింసలో ఎంతమేరకు ప్రమేయం ఉందో మణిపూర్ పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మణిపూర్‌లో మైతీ, కుకీ వర్గాల మధ్య హింస మే నెలలోనే ప్రారంభమైంది. ఈ సమయంలో ఇంఫాల్ లోయలో విపరీతమైన హింస, ఘర్షణ సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. శాంతిభద్రతలను నెలకొల్పేందుకు పోలీసులతో పాటు సైన్యం సహాయాన్ని తీసుకుంటున్నారు.

నిషేధిత సంస్థ ‘కాంగ్లీ యావోల్ కనా లూప్’ (కేవైకేఎల్)లో క్రియాశీలక సభ్యుడిని అరెస్టు చేసినట్లు మణిపూర్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. అతని నుంచి 9 ఎంఎం బెరెట్టా యుఎస్ కార్ప్ పిస్టల్, ఏడు రౌండ్లు (మందుగుండు సామగ్రి), దోపిడీ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు అతని గుర్తింపు లేదా అతనితో సంబంధం ఉన్న వ్యక్తుల సమాచారాన్ని వెల్లడించలేదు. ఈ అనుమానితుడు మణిపూర్ ఎమ్మెల్యే మేనల్లుడు అని కూడా చెప్పలేదు.

సీనియర్ పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘ ఆ వ్యక్తి పేరు కరమ్ సత్రాజిత్ సింగ్. ఇంఫాల్‌లోని సింగ్‌జమీ సూపర్‌మార్కెట్ ప్రాంతంలో ఇంఫాల్ వెస్ట్‌లోని కమాండో యూనిట్ అతన్ని అరెస్టు చేసింది. తాను మయన్మార్‌లో నివసిస్తున్న రాబర్ట్ అనే వ్యక్తితో కలిసి పనిచేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. మయన్మార్‌లో ఉన్న వ్యక్తుల కోరిక మేరకు, అతను పార్టీ ఫండ్ పేరుతో ప్రైవేట్ సంస్థలు, సాధారణ ప్రజల నుంచి డబ్బు వసూలు చేస్తున్నాడు. విచారణలో అతడు రాష్ట్ర ఎమ్మెల్యే మేనల్లుడని తేలింది’’ అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు