రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ చేయాల్సిన పోలీస్ పాల ప్యాకెట్ల దొంగగా మారాడు. ఎవరికీ తెలియదనుకున్నాడో ఏమో.. చక్కగా ప్యాకెట్లు దొంగిలించి కొలీగ్ తో కలిసి చెక్కేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో చోటు చేసుకుంది. నోయిడాలోని ఓ స్టోర్ వద్ద పాల ప్యాకెట్లను అమ్మే క్రమంలో తెల్లవారుజామున ఆరుబయట ఒక ట్రేలో ఎక్కువ సంఖ్యలో పాలప్యాకెట్లను ఉంచారు.
రాత్రి పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న పోలీసు కానిస్టేబుల్ కిందకు దిగి పాల ప్యాకెట్ల ట్రే వద్దకు వెళ్లాడు. అక్కడకు వెళ్లి తనకు కావాలసిన బ్రాండ్ కోసం వెదికాడు. అక్కడ ఉనన మూడు ట్రేలలో రెండు ప్యాకెట్లను సెలక్ట్ చేసుకున్నాడు. అవి తీసుకుని తెలివిగా జీపులో కూర్చొన్న మరో కానిస్టేబుల్‌కు అందించాడు.
ఆ తర్వాత ఇంకాసేపు అక్కడే చక్కర్లు కొట్టి షాపు యజమాని ముందు ఖాళీ చేతులతో కనపడి తర్వాత బయల్దేరి వెళ్లిపోయారు. సాధారణ చెకింగ్ లో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ చూస్తుంటే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసుకానిస్టేబుల్ పాలప్యాకెట్లను దొంగతనం చేస్తున్న వీడియో కాస్త సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. నోయిడా పోలీసు ఉన్నతాధికారులు పాలప్యాకెట్లను దొంగతనం చేసిన పోలీసు గురించి ఆరా తీస్తున్నారు.
#WATCH Policeman seen stealing packets of milk in Noida, Uttar Pradesh, yesterday. (Source: CCTV footage) pic.twitter.com/elszjwbyA1
— ANI UP (@ANINewsUP) January 20, 2020