చిన్న చీమ కుడితే పేద్దగా కేకలు వేస్తాం… ఏ చిన్న వస్తువు తగిలినా అల్లాడిపోతాం. అలాంటి ఓ టపాసుల డబ్బా నోట్లో పేలితే. అదీ ఎవరికి చెప్పుకోలేని నోరులేని మూగజీవి అయితే… ఆ భాద వర్ణనాతీరం. కేరళలోని ముళప్పురంలో ఇదే ఘటన చోటుచేసుకుంది. ఆకతాయిల చర్యతో గర్భంతో ఉన్న ఏనుగు తీవ్రంగా గాయాలపాలై చనిపోయింది. లోపల టపాసులు కాలుతున్నా… ఏ ఒక్కరికీ హాని చేయకుండా ఏనుగు చనిపోవడం అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.
నోరు లేని మూగజీవిని పొట్టనబెట్టుకున్నారు ఆకతాయిలు. ఆకలి కోసం ఆశగా వచ్చిన గజరాజుతో ఆటలాడారు. వెకిలి వేషాలు వేస్తూ పైనాపిల్‌లో క్రాకర్ పెట్టి తినిపించారు. దీంతో ఆ ఏనుగు అల్లాడిపోయింది. ఏం చేయాలో తెలియక పరుగులు తీసింది. పెద్దగా కేకలు వేస్తూ… కొన్ని గంటలపాటు నగరం చూసింది. నోటిలో తీవ్ర గాయాలవ్వడంతో…ఆ మంట తట్టుకోలేక ఓ నదిలోకి వెళ్లి ప్రాణాలు విడిచింది.
ఆ ఏనుగు బాధతో గ్రామమంతా పరుగులు తీసింది. కానీ లోపల ఎంత నొప్పి ఉన్నా… ఏ ఒక్కరికి హాని చేయలేదు. ఇక నీటిలో పడి చనిపోయిన ఏనుగును తీసేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. మరో రెండు ఏనుగుల సాయంతో దాన్ని బయటకు తీశారు. భారమైన హృదయంతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ ఘటనతో ముళప్పురం చుట్టపక్కల ప్రజలంతా చలించిపోయారు. ఏ ఒక్కరికీ హానీ చేయని ఏనుగు చనిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. గర్భంతో ఉన్న ఏనుగు చావుకు కారణమైన ఆకతాయిలను శిక్షించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.