Indian Railway : రైల్వే ప్రయాణీకులకు భారీ శుభవార్త.. ఇకపై చివరి నిమిషం వరకు ఎదురు చూడాల్సిన పనిలేదు..

Indian Railway : రైల్వే ప్రయాణికులు భారీ శుభవార్త. ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.

Indian Railway : రైల్వే ప్రయాణీకులకు భారీ శుభవార్త.. ఇకపై చివరి నిమిషం వరకు ఎదురు చూడాల్సిన పనిలేదు..

Indian Railway

Updated On : December 18, 2025 / 8:37 AM IST

Indian Railway : రైల్వే ప్రయాణికులు భారీ శుభవార్త. ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు భారతీయ రైల్వే (Indian Railway) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైలు బయలుదేరడానికి 10గంటల ముందే రిజర్వేషన్ చార్టు సిద్ధం కానుంది. ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్ సభ వేదికగా స్పష్టం చేశారు.

Also Read : Telangana Govt : తెలంగాణలో మళ్లీ ఎన్నికలు.. సిద్ధమైన రేవంత్ సర్కార్.. ఈసారి బీసీలకు 42శాతం సీట్లు..!

ప్రస్తుతం రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందు తయారు చేసే రిజర్వేషన్ చార్టును ఇకపై దాదాపు 10గంటల ముందుగానే ఖరారు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించి చార్ట్ ప్రిపరేషన్ షెడ్యూల్‌ను రైల్వే బోర్డు అప్డేట్ చేసింది. ఈ నూతన విధానంతో ముందే టికెట్ స్టేటస్‌ను చెక్ చేసుకోవడం ద్వారా ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడానికి ప్రయాణీకులకు వీలు కలుగుతుందని రైల్వేశాఖ భావిస్తుంది.

ఇప్పటి వరకు రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందు మాత్రమే రిజర్వేషన్ చార్టును సిద్ధం చేసేవారు. దీంతో ప్రత్యేకించి వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికుల్లో చివరి క్షణాల వరకు ఉత్కంఠ కొనసాగేది. పది గంటలు ముందుగా చార్టు సిద్ధం చేయడం వల్ల తాత్కాలిక బస, రైల్వే స్టేషన్లకు చేరుకునే ఏర్పాట్లు, అవసరమైతే ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించుకునేందుకు ప్రయాణికులకు అవకాశం కలుగుతుందని రైల్వే శాఖ పేర్కొంది. అన్ని రైల్వే జోన్లు దీన్ని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది.

కొత్త టైమింగ్స్ ప్రకారం..
ఉదయం 5గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు బయల్దేరే రైళ్లకు తొలి చార్టును ముందు రోజు రాత్రి 8గంటల వరకు రూపొందించాల్సి ఉంటుంది.
మధ్యాహ్నం 2.01 గంటల నుంచి రాత్రి 11.59గంటల వరకు బయల్దేరే రైళ్లకు,
అర్ధరాత్రి 12గంటల నుంచి ఉదయం 5గంటల వరకు బయలుదేరే రైళ్ల తొలి చార్టును కనీసం 10గంటల ముందు రూపొందించాలని రైల్వే బోర్డు తెలిపింది.