Indian Railways : రైల్వే ప్రయాణికులకు బిగ్‌షాక్.. పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తున్నారా.. అలా అస్సలు చేయొద్దు..

Indian Railways : లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. రైలులో

Indian Railways : రైల్వే ప్రయాణికులకు బిగ్‌షాక్.. పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తున్నారా.. అలా అస్సలు చేయొద్దు..

Indian Railways

Updated On : December 18, 2025 / 7:46 AM IST

Indian Railways : రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్. మీ వెంట లకేజీ తీసుకెళ్తున్నారా.. ఆ లగేజీ బరువు పరిమితికి మించి ఉంటే అదనపు డబ్బులు చెల్లించాల్సిందే. అయితే, ఓ ప్రయాణికుడు తన వెంట ఎంత లగేజీ తీసుకెళ్తే ఫ్రీగా అనుమతిస్తారు.. పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తే ఎంత అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుందనే విషయాన్ని లోక్ సభలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు.

Also Read : Buy New Phone : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? కొంటే ఇప్పుడే కొనండి.. వచ్చే ఏడాదిలో డబుల్ ప్రైస్ చెల్లించాలి.. ఎందుకంటే?

లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. రైలులో ప్రయాణించేటప్పుడు పరిమితికి మించి సామాను తీసుకువెళ్తే ప్రయాణికులు చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.

సెకండ్ క్లాసులో ప్రయాణికుడు 35 కిలోల సామాను ఫ్రీగా, 70కిలోల వరకు చార్జ్ చెల్లించి తీసుకెళ్లడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా.. స్లీపర్ క్లాస్ ప్రయాణికులు ఉచితంగా 40 కిలోలు, 80 కిలోల వరకు చార్జ్ చెల్లించి తీసుకెళ్లడానికి అనుమతి ఉంది. ఏసీ 2టైర్, చైర్‌ కార్‌లో ప్రయాణించే ప్రయాణికులు 40 కిలోల వరకు ఉచితంగా తీసుకెళ్లొచ్చు. ఇదే గరిష్ఠ పరిమితని కేంద్ర మంత్రి వివరించారు.

ఫస్ట్ క్లాస్, ఏసీ-2 టైర్ ప్రయాణికులు 50 కిలోల సామాను ఉచితంగా, 100 కిలోల వరకు చార్జ్ చెల్లించి తీసుకెళ్లడానికి అనుమతి ఉందని పేర్కొన్నారు. ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు 70 కిలోల వరకు ఉచితంగా, 150 కిలోల వరకు చార్జ్ చెల్లించి తీసుకువెళ్లొచ్చని కేంద్ర మంత్రి లోక్ సభ వేదికగా వెళ్లడించారు.

విత్ డ్రా కుదరదు..
ఐఆర్‌సీటీసీ వాలెట్‌లో డిపాజిట్ చేసిన సొమ్మును విత్ డ్రా చేయడం కుదరదని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. ఆ మొత్తంలో కేవలం టికెట్లు మాత్రమే కొనుగోలు చేయగలమని క్లారిటీ ఇచ్చారు. ఆ ఖాతా పూర్తిగా క్లోజ్ చేసిన సందర్భంలో మాత్రమే అందులో ఉన్న మొత్తం బ్యాంక్ ఖాతాకు బదిలీ అవుతుందని చెప్పారు. ప్రీపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌కు సంబంధించి ఆర్బీఐ జారీ చేసిన నిబంధనలు విత్ డ్రాకు అంగీకరించవని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

10 గంటల ముందే చార్ట్ ప్రిపరేషన్‌..
రైలు ప్రయాణాల్లో అనిశ్చితి తొలగించడానికి రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందు తయారు చేసే రిజర్వేషన్ చార్టును ఇకపై దాదాపు 10గంటల ముందుగానే ఖరారు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి చార్ట్ ప్రిపరేషన్ షెడ్యూల్ ను రైల్వే బోర్డు అప్డేట్ చేసింది. ఈ నూతన విధానం ద్వారా ముందే టికెట్ స్టేటస్ ను చెక్ చేసుకోవడం ద్వారా ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడానికి వీలు కలుగుతుందని రైల్వేశాఖ భావిస్తుంది.