Buy New Phone : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? కొంటే ఇప్పుడే కొనండి.. వచ్చే ఏడాదిలో డబుల్ ప్రైస్ చెల్లించాలి.. ఎందుకంటే?

Buy New Phone : 2026లో స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా పెరగబోతున్నాయి.. అసలు కారణాలేంటో తెలుసా? మెమరీ చిప్‌ల కొరత ఒకటి.. ప్రధానంగా ఏఐ డేటా సెంటర్ల నుంచి హై డిమాండ్ కూడా కారణంగా చెప్పవచ్చు.

Buy New Phone : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? కొంటే ఇప్పుడే కొనండి.. వచ్చే ఏడాదిలో డబుల్ ప్రైస్ చెల్లించాలి.. ఎందుకంటే?

Buy New Phone

Updated On : December 17, 2025 / 5:55 PM IST

Buy New Phone 2026 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇప్పుడే కొనేసుకోండి. వచ్చే ఏడాది వరకు ఆగితే ఏదైనా ఫోన్ కొనుగోలుపై ఇప్పటి ధర కన్నా రెట్టింపు ధర చెల్లించాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో మీ ఫోన్‌ అప్‌గ్రేడ్ చేయడం కష్టమే.. అందుకే వీలైనంత త్వరగా కొత్త ఫోన్ కొనేసుకోవడం బెటర్. ఆపిల్, వన్‌ప్లస్, ఐక్యూ వంటి బ్రాండ్లు గత ఏడాది వాటి ఫోన్లతో పోలిస్తే ఫ్లాగ్‌షిప్ మోడళ్ల ధరలను భారీగా పెంచేశాయి.

ఇప్పుడు, 2026లో బేసిక్ స్మార్ట్‌ఫోన్‌లు కూడా ఖరీదైనవి మారనున్నాయి. కౌంటర్‌ప్రాయింట్ రీసెర్చ్ ప్రకారం.. భారీ మౌలిక సదుపాయాల చిప్‌లకు ఉన్న డిమాండ్ తీవ్ర కొరతకు కారణమవుతోంది. ఫలితంగా సాధారణ స్మార్ట్‌ఫోన్ యూజర్లపై తీవ్ర ప్రభావం పడనుంది. ముఖ్యంగా డేటా సెంటర్ల నుంచి అధిక డిమాండ్ కారణంగా ప్రొడక్టుల ఖర్చులు పెరగడంతో స్మార్ట్‌ఫోన్ తయారీదారులు తీవ్ర నష్టాల్లో ఉన్నారు.

ప్రస్తుతం మోడ్రాన్ స్మార్ట్‌ఫోన్‌లు, అడ్వాన్స్ ఏఐ సర్వర్‌లు రెండూ ఒకే రకమైన మెమరీ చిప్‌లు, ముఖ్యంగా DRAMపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. సంక్లిష్టమైన టాస్కులను రన్ చేసేందుకు ఈ ప్రాసెసర్‌లు తప్పనిసరి. చిప్‌లను ఏఐ డేటా సెంటర్‌లకు విక్రయించడం ఫోన్ తయారీదారులకు మరింత ప్రయోజనకరంగా మారుతుంది. దీని కారణంగా, తయారీదారులు హై-మార్జిన్ కస్టమర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని కారణంగా యూజర్ సెంట్రలైజడ్ వస్తువులలో వాడే చిప్‌ల ధరలు కూడా భారీగా పెరగనున్నాయి.

Read Also : Best Camera Phones 2025 : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి బ్రో.. DSLR కెమెరా కన్నా తోపు ఫీచర్లతో 5 బెస్ట్ కెమెరా ఫోన్లు.. ఏది కొంటారో మీదే ఛాయిస్..!

2026లో ఫోన్ల ధరలు పెరుగుతాయా? :
కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం.. 2026లో ఈ పరిస్థితి మరింత దిగజారనుంది. 2026 మొదటి అర్ధభాగంలో ఫోన్లలో చిప్స్ వాడే వారి ధరలు కనీసం 40 శాతం పెరగవచ్చు. దాంతో ఫోన్ల ధరలు పెరగొచ్చు. కొనుగోలుదారులపై తీవ్ర ప్రభావం పడనుంది.

ఇంకా, ఉత్పత్తి వ్యయం 20 శాతం నుంచి 30 శాతం పెరిగే అవకాశం ఉంది. దీని కారణంగా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లపై ఎక్కువగా ఎఫెక్ట్ పడనుంది. ఈ ఫోన్ల ధరల పెరుగుదల కారణంగా 2026లో ప్రపంచ స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌లు 2.1 శాతం తగ్గుతాయని పరిశోధన సూచిస్తుంది.

2026లో స్మార్ట్‌ఫోన్ల ధరలు దాదాపు 6.9 శాతం పెరుగుతాయని నివేదిక సూచిస్తోంది. ఆపిల్, శాంసంగ్ వంటి బ్రాండ్లు ఈ ధరల పెంపుతో తమ ప్రొడక్టులపై అధిక ప్రభావం చూపే అవకాశం లేదు. అంతేకాకుండా, Xiaomi, Realme, Oppo వంటి బ్రాండ్ ఫోన్‌ల ధరలు కూడా పెరగనున్నాయి.