శ్రీలంక పేలుళ్లను ఖండించిన రాష్ట్రపతి

  • Publish Date - April 21, 2019 / 08:57 AM IST

శ్రీలంకలో జరిగిన భయంకరమైన వరుస బాంబు పేలుళ్ల ఘటనను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదులు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఇటువంటి చర్యలకు పాల్పడటం దారుణమన్నారు.ఇటువంటి వ్యక్తులు  వ్యక్తులకు నాగరిక సమాజంలో బ్రతికే హక్కు లేదన్నారు. ఈ విపత్తు సమయంలో శ్రీలంకకు అన్ని విధాలుగా అండగా ఉండనున్నట్లు రాష్ట్రపతి ప్రకటించారు.

కాగా కోచికడే, సెయింట్ సెబాస్టియన్, బట్టికలోయ చర్చిల్లో ఈస్టర్ ప్రార్థనలు చేస్తున్న భక్తులను టార్గెట్ చేసుకుని ఈ దాడులు జరిగిన విషయం తెలిసిందే. హోటల్ షాంగ్రి లా, సిన్నమాన్ గ్రాండ్ హోటల్స్‌లోనూ పేలుళ్ల చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఇప్పటి వరకూ మృతుల సంఖ్య 185కు చేరుకుంది. ఈ క్రమంలో బాంబు దారుణంలో గాయపడినవారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.