ప్రధాని మోడీ జీవితంలో ఆసక్తికర అంశాలు
ఇంటర్వ్యూలో స్వయంగా తెలిపిన మోడీ
దీపావళి పండుగ వస్తే అడవులకెళ్లేవాడిని
17 ఏళ్ల వయస్సులో హిమాలయాలకెళ్లా
ఢిల్లీ : హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఫేస్‌బుక్ ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్రమోడీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. తాను యువకుడిగా ఉన్నప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు. తన నడవడిక, తనను తాను తీర్చిదిద్దుకోవడం కోసం తాను అనుసరించిన పద్దతులను గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ప్రతీ ఏటా దీపావళి పండగకు తాను అడవిలోకి వెళ్లిన సమయంలో ఐదు రోజుల పాటు అక్కడే ఒంటరిగా గడిపేవాడినని..ఈ ఐదురోజులకు సరిపడా ఫుడ్..ఆహారాన్ని తీసుకెళ్లేవాడినని…రేడియో గానీ..న్యూస్ పేపర్ గానీ తీసుకెళ్లేవాడిని కాదనీ..ఆరోజుల్లో టీవి, ఇంటర్నెట్ వంటివి లేవని గుర్తుచేశారు. ఇలా చేయటం వల్ల తన వ్యక్తిత్వగతంగా చాలా స్ట్రాంగ్ వుండేవాడినన్నారు. ప్రతీ మనిషి తనలోని గొప్పతనాన్ని తెలుసుకోకుండా..దేనికోసమో పాకులాడుతుంటారనీ అలా చేయకుండా వుంటే మానసిక ప్రశాంతత వుంటుందని తెలిపారు. ఆర్ఎస్‌ఎస్‌తో తన అనుబంధాన్ని, తన 17ఏళ్ల వయస్సులో హిమాయాలకు వెళ్లిన నాటి రోజులను కూడా మోదీ గుర్తుచేసుకున్నారు.
ప్రజెంట్ జనరేషన్ అంతా బిజీ బిజీ లైఫ్ ని జీవిస్తోందనీ..కానీ ఈ జీవితానికి కాస్తంత విరామం ఇచ్చి కొంత సమయం మీతో మీరు గడిపితే అది జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. అప్పుడే మీరు నిజమైన ప్రపంచంలో జీవించగలుగుతారని సూచించారు. ఇలా చేయటం వల్ల మీ గురించి మీకు తెలుస్తుంది. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది’ అని యువతకు మోడీ సూచించారు. ఇచ్చారు.