PM Modi Convoy Size: ప్రధాని మోదీ కాన్వాయ్ లో వాహనాల తగ్గింపు.. ఇప్పుడు రెండు కార్లే
పొదుపు చర్యలు పాటించాలని దేశ ప్రజలకు పిలుపునివ్వడమే కాదు.. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇంధన పొదుపు చర్యలను ప్రారంభించారు.
- Naveen
- Updated on- May 13, 2026 / 04:32 PM IST
PM Modi Convoy Size: ప్రధాని మోదీ కాన్వాయ్ సైజును కుదించారు. SPG (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) కాన్వాయ్ లో 50శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇకపై ప్రధాని మోదీకి రెండు వాహనాలతోనే ప్రోటోకాల్ భద్రతను అందించనున్నారు. ఇక పై ఎక్కడికి వెళ్లినా ప్రధాని మోదీ వెంట రెండు కార్లే ఉండనున్నాయి. పొదుపు చర్యల్లో భాగంగా ప్రధాని కార్యాలయం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇటీవల పొదుపు చర్యలకు పిలుపునిచ్చిన మోదీ ముందుగా తన కాన్వాయ్ నే తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంధనం పొదుపు దిశగా అడుగులు వేశారు.
అందుకోసం ఇప్పుడు వాడుతున్న డీజిల్ వాహనాల ప్లేస్ లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను ప్రోత్సహించాలని మోదీ సూచించారు. హైదరాబాద్ పర్యటన సందర్భంగా దేశ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు మోదీ. పొదుపు చర్యలు పాటించాలని కోరారు. ఇంధనం ఆదా చేయాలని, బంగారం వినియోగం తగ్గించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ సైతం ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
పొదుపు చర్యలు పాటించాలని దేశ ప్రజలకు పిలుపునివ్వడమే కాదు.. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇంధన పొదుపు చర్యలను ప్రారంభించారు. ఇందులో భాగంగా కాన్వాయ్ సైజును భారీగా తగ్గించారు. సాధారణంగా మోదీ కాన్వాయ్‌లో 12-15 వాహనాలు ఉంటాయి. ఇవాళ ఢిల్లీలో రెండు వాహనాలు మాత్రమే వినియోగించారు. ప్రొటోకాల్ ప్రకారం అవసరమైన భద్రతా అంశాలను పాటిస్తూనే వాహనాల సంఖ్యను భారీగా తగ్గించారు. ప్రధాని పిలుపుతో పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం తమ కాన్వాయ్‌లో కార్ల సంఖ్యను తగ్గిస్తున్నారు.
ప్రధాని మోదీ ఇంధన పొదుపు సూచనలతో కేంద్ర మంత్రులు కూడా అదే బాటలో నడుస్తున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా సైతం తన కాన్వాయ్ ను తగ్గించుకున్నారు. అటు ఢిల్లీ మంత్రి కపిల్ శర్మ మెట్రోలో ప్రయాణించారు. ప్రయాణికులతో ముచ్చటించారు. మరోవైపు మధ్యప్రదేశ్ సీఎం కూడా తన కాన్వాయ్ ను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాని పిలుపుతో ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతోందని చెబుతున్నారు.
Also Read: గ్యాస్ వినియోగదారులకు బిగ్‌షాక్.. వారందరికీ ఇకపై సబ్సిడీ కట్.. ఏడు రోజులే అవకాశం?
