మోడీ అంటున్న మాట : బీజేపీ వాళ్లను తృణమూల్ గూండాలు కొడుతున్నారు

తృణముల్ కాంగ్రెస్ పై ప్రధాని మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం(ఏప్రిల్-29,2019) వెస్ట్ బెంగాల్ లోని శీరంపోర్ లో నిర్వహించిన ర్యాలీలో మోడీ మాట్లాడారు. తృణముల్ కాంగ్రెస్ గూండాలు బీజేపీకి ఓట్లు పడనీయకుండా తమ శక్తివంచన మేర కృషి చేస్తున్నారని, బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని మోడీ విమర్శించారు. బీజేపీ నాయకులు ప్రచారంలో పాల్గొనకుండా తృణముల్ గూండాలు అడ్డుకుంటున్నారని విమర్శించారు.

మే-23,2019న ఫలితాలు వెలువడిన తర్వాత ప్రతిచోట కమలం వికసిస్తుందని,తృణముల్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వదిలేస్తారని,ఈ రోజు కూడా మమత పార్టీలోని 40మంది ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని మోడీ అన్నారు.