Narendra Modi: ఆగస్టు 6న రికార్డు సృష్టించేందుకు సిద్ధమైన ప్రధాని మోదీ.. ఇంతకీ ఆరోజు ఏం చేయనున్నారో తెలుసా?

నగరానికి ఇరువైపులా సరైన అనుసంధానంతో ఈ స్టేషన్లను 'సిటీ సెంటర్స్'గా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేస్తున్నారు. ఈ 508 స్టేషన్లు 27 రాష్ట్రాలు సహా పలు కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి

AMRIT BHARAT STATIONS: ఆగస్టు 6న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ పునరాభివృద్ధి పని అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జరుగుతుంది. వాస్తవానికి ఈ పథకం కింద దేశవ్యాప్తంగా మొత్తం 1309 స్టేషన్లను పునరాభివృద్ధి చేయాల్సి ఉంది. అందులో భాగంగా 500లకు పైగా ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. కాగా, రైల్వేలో ఇంత పెద్ద మొత్తంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం ఇదే మొదటిసారి.

Most Dangerous Tree : ఈ చెట్టును ముట్టుకుంటే ప్రాణాలే పోతాయ్ .. చెట్టు ఆకులు, బెరడు, పండ్లు అంతే విషమే

ఈ ప‌థ‌కం కింద 508 స్టేష‌న్ల పున‌రాభివృద్ధికి మొత్తం 24,470 కోట్ల రూపాయలకు పైగా అవుతుంది. నగరానికి ఇరువైపులా సరైన అనుసంధానంతో ఈ స్టేషన్లను ‘సిటీ సెంటర్స్’గా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేస్తున్నారు. ఈ 508 స్టేషన్లు 27 రాష్ట్రాలు సహా పలు కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో చెరో 55, బీహార్‌లో 49, మహారాష్ట్రలో 44, పశ్చిమ బెంగాల్‌లో 37, మధ్యప్రదేశ్‌లో 34, అస్సాంలో 32, ఒడిశాలో 25, పంజాబ్‭లో 22‌, గుజరాత్, తెలంగాణలో 21 చొప్పున, జార్ఖండ్‌లో 20, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో 18 చొప్పున, హర్యానాలో 15, కర్ణాటకలో 13 ఉన్నాయి.

Rahul Gandhi: సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి భారీ ఊరట.. ఇకముందు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిక

ఆధునిక ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ రైల్వే స్టేషన్లను సిద్ధం చేయనున్నారు. అధునాతనంగా రూపొందించబడిన ట్రాఫిక్ సౌకర్యంతో పాటు, ఇంటర్ మోడల్ రిజిస్టర్ తో వీటిని తీర్చిదిద్దనున్నారు. స్టేషన్ భవనాల రూపకల్పన స్థానిక సంస్కృతి, వారసత్వం, వాస్తుశిల్పం ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ రైల్వే స్టేషన్ సదరు నగర అందాలను ప్రతిబింబిస్తుందని రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు