Viral Video : స్కూల్లోని వంటగదిలో ప్రిన్సిపాల్.. వీడియో తీసిన టీచర్.. ఆ తరువాత..
విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించే పవిత్రమైన వృతిలో ఉన్న ఓ ప్రధానోపాధ్యాయురాలు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- Thota Vamshi Kumar
- Published on- April 19, 2024 / 07:14 PM IST
Principal Gets Facial Done In School Bites Teacher Who Caught Her
విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించే పవిత్రమైన వృతిలో ఉన్న ఓ ప్రధానోపాధ్యాయురాలు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మిగిలిన టీచర్లకు ఆదర్శంగా ఉండాల్సిన ఆమె కాస్ల్‌కు డుమ్మా కొట్టింది. అంతేనా.. విద్యార్థుల కోసం ఆహారాన్ని సిద్ధం చేసే గదిలో తీరిగ్గా ఫేషియల్ చేయించుకుంది. ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటుండగా చూసిన ఓ ఉపాధ్యాయురాలు దాన్ని వీడియో తీసింది. దీన్ని గమనించిన ప్రధానోపాధ్యాయురాలు సదరు ఉపాధ్యాయురాలిపై దాడికి పాల్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్ జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దండమౌ గ్రామంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో సంగీతాసింగ్ ప్రధానోపాధ్యాయురాలిగా పని చేస్తోంది. అయితే.. ఆమె విద్యార్థులకు పాఠాలు బోధించకుండా విద్యార్థుల కోసం ఆహారాన్ని సిద్ధం చేసే ప్రాంతంలో ఫేషియల్ చేయించుకుంటుండగా అనమ్ ఖాన్ ఉపాధ్యాయురాలు చూసి వీడియో తీసింది. దీన్ని గమనించిన సంగీతా సింగ్ తన కుర్చీలోంచి లేచి అనమ్ ఖాన్‌తో వాగ్వాదానికి దిగారు.
Viral Video : ఇదేందయ్యా ఇదీ.. బికినీ ధరించి బస్సు ఎక్కిన మహిళ..
ఆమె పై దాడి చేసి ఫోన్‌ను లాక్కొనే క్రమంలో చేతిని కొరికింది. దీంతో అనమ్కు గాయాలయ్యాయి. సంగీతా సింగ్ ఫేషియల్ చేయించుకుంటున్న వీడియోతో పాటు తన గాయాలతో ఉన్న వీడియోను సైతం అనయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ రెండు వీడియోలు వైరల్‌గా మారాయి. అదే సమయంలో సంగీతాసింగ్ పై ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
