Viral Video : ఇదేందయ్యా ఇదీ.. బికినీ ధరించి బస్సు ఎక్కిన మహిళ..
ఓ మహిళ బికినీ ధరించి రద్దీగా ఉన్న బస్సు ఎక్కిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఓ మహిళ బికినీ ధరించి రద్దీగా ఉన్న బస్సు ఎక్కిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమెను చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కు గురి అయ్యారు. మెట్ల వద్ద ఆమె నిలబడగా అక్కడ కూర్చుని ఉన్న కొందరు ప్రయాణికులు లేచి వెళ్లారు.
12 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోలో బికినీ ధరించిన మహిళ బస్సులోకి రావడంతో మరో మహిళా ప్రయాణికురాలు ఆమెను దాటుకుంటూ ముందుకు వచ్చింది. ఓ పురుషుడు సైతం కూర్చున్న సీటులోంచి లేచి బస్సు ముందు భాగానికి వచ్చాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రెండుగా విడిపోయారు. కొందరు మహిళ తీరును తప్పుబడుతుంటే ఇంకొందరు మాత్రం ఆమెకు సపోర్టుగా మాట్లాడుతున్నారు.
Viral Video : పార్కులో బేస్‌బాల్ బ్యాట్‌తో భార్యను చితక్కొట్టిన భర్త..
సదరు మహిళ వస్త్రాధారణ చూసి షాక్ అయ్యామని, ఆమె తీరు అభ్యంతరంగా ఉందని కొందరు అనగా మరికొందరు ఆమె కోరుకున్నది ధరించడం ఆమె ఇష్టం అని వాదించారు. ఇంకొందరు ఢిల్లీ పోలీసులకు ఈ వీడియోను ట్యాగ్ చేశారు. సదరు మహిళ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా.. దీనిపై అధికారులు ఎవరూ ఇంకా స్పందించలేదు.
అయితే.. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగింది అన్న విషయాలు స్పష్టంగా లేవు.
What’s really happening 😵💫😵💫pic.twitter.com/rfjavOsWMp
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) April 17, 2024