రైల్వేలో ఉద్యోగాలు : ఆ కులం వారు మాత్రమే అర్హులు

భారతీయ రైల్వేలో క్యాటరింగ్ కాంట్రాక్ట్ తీసుకునే ప్రముఖ సంస్థ.. విడుదల చేసిన ఓ ఉద్యోగ ప్రకటన పెద్ద వివాదానికి దారితీసింది. తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇంతకీ ఆ యాడ్ లో

  • Publish Date - November 7, 2019 / 04:06 PM IST

భారతీయ రైల్వేలో క్యాటరింగ్ కాంట్రాక్ట్ తీసుకునే ప్రముఖ సంస్థ.. విడుదల చేసిన ఓ ఉద్యోగ ప్రకటన పెద్ద వివాదానికి దారితీసింది. తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇంతకీ ఆ యాడ్ లో

భారతీయ రైల్వేలో క్యాటరింగ్ కాంట్రాక్ట్ తీసుకునే ప్రముఖ సంస్థ.. విడుదల చేసిన ఓ ఉద్యోగ ప్రకటన పెద్ద వివాదానికి దారితీసింది. తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇంతకీ ఆ యాడ్ లో ఏముందంటే.. క్యాటరింగ్ కు సంబంధించి 100 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్టు ప్రకటన ఇచ్చారు. అయితే ఒక కులానికి చెందిన వ్యక్తులు మాత్రమే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని కండీషన్ పెట్టారు. మంచి కుటుంబ నేపథ్యం ఉన్న ”అగర్వాల్ వైశ్య” కులానికి చెందిన వారు మాత్రమే అప్లయ్ చేసుకోవాలని అందులో ఉంది. ఇది కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. 

వివరాల్లోకి వెళితే.. రైల్వేలో క్యాటరింగ్ కాంట్రాక్ట్ తీసుకునే ప్రముఖ సంస్థ ఆర్కే మీల్స్ ఈ ప్రకటన జారీ చేసింది. ఐఆర్‌సీటీసీ క్యాంటీన్‌లో 100 ట్రైన్ క్యాటరింగ్ మేనేజర్, బేస్ కిచెన్ మేనేజర్, స్టోర్ మేనేజర్ పోస్టుల భర్తీకి ఆర్కే మీల్స్ .. బృందావన్ ఫుడ్ ప్రొడక్ట్స్ పేరుతో యాడ్ ఇచ్చింది. కులం గురించి ప్రస్తావించడంతో ఈ ప్రకటన సోషల్ మీడియా వైరల్ అయ్యింది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడటంతో ఐఆర్‌సీటీసీ స్పందించాల్సి వచ్చింది.

వెంటనే యాడ్ ని తొలగించింది. అంతేకాదు యాడ్ ఇచ్చిన హెచ్ఆర్ సిబ్బందిని తొలగించింది. ఆర్కే మీల్స్ కాంట్రాక్టర్ ని కూడా గట్టిగా హెచ్చరించింది. మరోసారి ఇలాంటి పొరపాట్లు జరిగితే ఊరుకునేది లేదంది. కులమతాలతో సంబంధం లేకుండా నియామకాలు చేపట్టాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించింది. బృందావన్ ఫుడ్ ప్రొడక్ట్స్ ని ఆర్కే మీల్స్ అని పిలుస్తారు. ఇది ప్రైవేట్ క్యాటరింగ్ కాంట్రాక్ట్ సంస్థ. దీని హెడ్ ఆఫీస్ ఢిల్లీలోని ఓక్లాలో ఉంది. సుమారు 100 రైళ్లలో క్యాటరింగ్ సేవలు అందిస్తుంది.