Priyanka Chopra: ప్రియాంక చోప్రా ప్రెగ్నెన్సీపై తస్లీమా నస్రీన్ ఘాటు వ్యాఖ్యలు

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సరోగసీ ప్రెగ్నెన్సీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన 24గంటల్లోనే సోషల్ మీడియాలో ప్రకటించాడు ఆమె భర్త నిక్ జోనస్.

Tasleema Nasreen

Priyanka Chopra: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సరోగసీ ప్రెగ్నెన్సీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన 24గంటల్లోనే సోషల్ మీడియాలో ప్రకటించాడు ఆమె భర్త నిక్ జోనస్. దీనిపై ప్రముఖ రచయిత తస్లీమా నస్రీన్ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

‘సరోగసీ అనేది పేద మహిళలు ఉన్నారు కాబట్టే సాధ్యమవుతుంది. ధనికులు ఎప్పుడూ తమ కోసం సమాజంలో పేదలను ఉండాలని కోరుకుంటూనే ఉంటారు. మీకు నిజంగా పిల్లల్ని పెంచాలనిపిస్తే.. ఇల్లు లేని వారిని దత్తత తీసుకోండి. పిల్లలు మీ లక్షణాలను వారసత్వంగా పొందేలా చూడండి. ఇది కేవలం స్వార్థపూరిత అహం” అని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

దాంతో పాటుగా.. ‘ఇలాంటి తల్లులు సరోగసి ద్వారా రెడీమేడ్ గా పిల్లలను పొంది ఎలా ఫీల్ అవుతారు? సహజంగా గర్భం దాల్చి నవమోసాలు మోసి కన్నతల్లుల్లాగే ఫీల్ అవుతారా?’ అంటూ ప్రియాంక చోప్రాపై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: వీళ్లిద్దరి వల్లే బతికున్నా