Karnataka Elections Result: కర్ణాటక ఎన్నికల్లో అందుకే గెలిచాం: ప్రియాంక గాంధీ
Priyanka Gandhi Vadra: బీజేపీ ఎటువంటి ప్రయత్నాలు చేసిందో, వాటిని ప్రజలు ఎలా తిప్పికొట్టారో ప్రియాంక చెప్పారు.
- T Venkateshwarlu
- Published On : May 13, 2023 / 06:43 PM IST
Priyanka Gandhi
Karnataka: భారత్ జోడో యాత్ర కలిసొచ్చిందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) అన్నారు. కర్ణాటక (Karnataka) ఎన్నికల ఫలితాలపై ఆమె హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోని సిమ్లాలో మాట్లాడుతూ… ప్రజల సమస్యల గురించి మాట్లాడకుండా, ప్రజల దృష్టిని మళ్లించేలా బీజేపీ నేతలు మాట్లాడారని అన్నారు.
అటువంటి రాజకీయాలు చేయొద్దని, ఇది చాలా ముఖ్యమైన అంశమని ప్రియాంక గాంధీ చెప్పారు. సమస్యల గురించి మాట్లాడకుండా ప్రజల దృష్టిని మళ్లించేలా మాట్లాడొద్దని, ఇకపై దేశంలో ఈ వ్యూహం ఫలించబోదని అన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో మనం ఇదే చూశామని తెలిపారు. ప్రజలు తాము ఎదుర్కొంటోన్న సమస్యల పరిష్కారాన్ని కోరుకుంటున్నారని చెప్పారు.
అలాగే, తన సోదరుడు రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర తమకు కలిసి వచ్చిందని ప్రియాంక గాంధీ అన్నారు. కాంగ్రెస్ ను గెలిపించిన కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నానని చెప్పారు. తమ పార్టీ ప్రజలకు న్యాయం చేస్తుందని అక్కడి ప్రజలు నమ్మారని, దాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు.
కర్ణాటక కాంగ్రెస్ నేతలు డీకే శివకుమార్, సిద్ధరామయ్యకు అభినందలు తెలుపుతున్నానని ప్రియాంక గాంధీ చెప్పారు. కాగా, గత ఏడాది హిమాచల్ ప్రదేశ్, ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది. తదుపరి, తెలంగాణ, ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల్లోనూ గెలుస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
Bandi Sanjay : కర్నాటకలో బీజేపీ ఓటమికి కారణమిదే- బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
