Bandi Sanjay : కర్నాటకలో బీజేపీ ఓటమికి కారణమిదే- బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

Bandi Sanjay Kumar : రేపు భజరంగ్ దళ్ ని నిషేధించి, పీఎఫ్ఐపై నిషేధం ఎత్తివేస్తారు. 4శాతం ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తారు.

Bandi Sanjay : కర్నాటకలో బీజేపీ ఓటమికి కారణమిదే- బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

Bandi Sanjay

Bandi Sanjay On Karnataka Results : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి కన్నడ ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. బీజేపీని ఓడించి గద్దె దించారు. కాంగ్రెస్ కి పట్టం కట్టారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. అంతేకాదు, కర్నాటక ఫలితాలు తెలంగాణపైనా కచ్చితంగా ప్రభావం చూపుతాయని, తెలంగాణలోనూ కర్నాటక ఫలితాలు రిపీట్ అవుతాయని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, కర్నాటక ఎన్నికల ఫలితాలపై తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. కర్నాటకలో బీజేపీ ఓటమికి కారణం ఏంటో ఆయన చెప్పారు.(Bandi Sanjay Kumar)

Also Read..Rahul Gandhi : కర్ణాటకలో ప్రేమ దుకాణం తెరుచుకుంది.. ప్రతి రాష్ట్రంలో ఇదే రిపీట్ అవుతుంది

కర్ణాటకలో అన్ని పార్టీలు కలిసి మతతత్వ రాజకీయాలు చేశాయని, అన్ని పార్టీలు ఏకమై బీజేపీని ఓడించాయని బండి సంజయ్ అన్నారు. భజరంగ్ దళ్ ని నిషేధిస్తామని, ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తామని అన్ని పార్టీలు మతతత్వ రాజకీయాలు చేశాయని మండిపడ్డారు. జేడీఎస్ ఓట్లు కాంగ్రెస్ కి వేయాలని జేడీఎస్ అధ్యక్షుడే బహిరంగంగా చెప్పారని బండి సంజయ్ అన్నారు. అయినా, ఈ ఫలితాలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారాయన. దేశంలో ఒక రాష్ట్రంలో జరిగిన ఎన్నికలగానే చూడాలన్నారు.

ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరు అన్నారు. కర్ణాటకలో మా ఓట్లు తగ్గలేదు, 36 శాతం ఓట్లు సాధించామని బండి సంజయ్ తెలిపారు. కాంగ్రెస్ కి 5 శాతం ఓటింగ్ పెరిగిందని, జేడీఎస్ కు 7శాతం ఓటింగ్ తగ్గిందన్నారు. దేశంలోని 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని బండి సంజయ్ గుర్తు చేశారు.(Bandi Sanjay Kumar)

Also Read..Minister KTR : కేరళ స్టోరీ సినిమాలాగే కర్ణాటక ఫలితాలు కూడా .. తెలంగాణలో అవి పనిచేయవ్ ..

”ఎంఐఎం, ఎన్‌డీపీఐ, జేడీఎస్, కాంగ్రెస్ అందరూ కలిశారు. రేపు భజరంగ్ దళ్ ని నిషేధించి, పీఎఫ్ఐపై నిషేధం ఎత్తివేస్తారు. 4శాతం ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తారు. కాంగ్రెస్, బీజేపీ రేపు తెలంగాణలో కలిసే పోటీ చేస్తాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్యాంప్ హైదరాబాద్ లో పెట్టేందుకు కేసీఆర్ సాయం చేస్తారు. కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కి డబ్బు సాయం చేసింది” అని బండి సంజయ్ ఆరోపించారు.

కర్నాటకలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 224. కాంగ్రెస్ 136 స్థానాల్లో గెలుపొందింది. హస్తం పార్టీకి స్పష్టమైన మెజారీ దక్కింది. ఇక, ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 113. కాగా, మేజిక్ ఫిగర్ కు 23 స్థానాలు ఎక్కువే గెలిచిన హస్తం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యాలయాల దగ్గర పండగ వాతావరణం నెలకొంది. స్వీట్లు పంచుకుంటూ, బాణసంచా కాల్చుతూ, ఆనందోత్సాహాలతో నృత్యాలు చేశారు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు.(Bandi Sanjay Kumar)

అధికార బీజేపీకి కన్నట ఓటర్లు షాక్ ఇచ్చారు. బీజేపీ 64 సీట్లకే పరిమితమైంది. జనతాదళ్ (ఎస్) 20 స్థానాల్లో నెగ్గగా, ఇతరులు 4 స్థానాలు కైవసం చేసుకున్నారు.