Education in Mother Tongue: మాతృ భాషలో ఉన్నత విద్యపై కీలక వ్యాఖ్యలు చేసిన అమిత్ షా

మాతృభాషలో విద్యాభ్యాసం సులువు. దేశంలోని ప్రతిభావంతులు ఉన్నత విద్యలో చేరేందుకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. నేడు మన దేశంలోని 5 శాతం ప్రతిభను మాత్రమే ఉపయోగించుకోగలుగుతున్నాం. హిందీ లేదా ప్రాంతీయ భాషల్లో విద్యా బోధన జరిగితే, నూటికి నూరు శాతం ప్రతిభను ఉపయోగించుకోవచ్చు. ఈ 5 శాతం వ్యక్తులు ఆంగ్ల నేపథ్యం గలవారన్నారు

Education in Mother Tongue: ఉన్నత విద్యను మాతృ భాషల్లోనే బోధించాలనే నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం మరింత ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయమై తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. సాంకేతిక, వైద్య, న్యాయ శాస్త్ర విద్యా బోధన హిందీ లేదా ప్రాంతీయ భాషల్లో జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అమిత్ షా పిలుపునిచ్చారు. దీనివల్ల ఆంగ్లం మాట్లాడలేని విద్యార్థుల ప్రతిభాపాటవాలను దేశం ఉపయోగించుకోవడం సాధ్యపడుతుందని ఆయన అన్నారు. బుధవారం పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్భంగా మాట్లాడుతూనే మాతృ భాషలో విద్యా బోధన ప్రాధాన్యతను వివరించారు.

Kashmir Files : ముదురుతున్న కాశ్మీర్ ఫైల్స్ వివాదం.. నదవ్ లాపిద్ పై నమోదైన పోలీస్ కేసు..

‘‘టెక్నికల్, మెడికల్, న్యాయ శాస్త్ర విద్యను హిందీతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో బోధించాలి. ఈ మూడు రంగాల్లోని పాఠాలను ప్రాంతీయ భాషల్లోకి సరైనవిధంగా అనువదించడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. దీనివల్ల ఆంగ్లం మాట్లాడలేని విద్యార్థుల ప్రతిభాపాటవాలను దేశం ఉపయోగించుకోవడం సాధ్యపడుతుంది. విద్యార్థులు తమ మాతృభాషలో చదువుకుంటే, మౌలిక ఆలోచనా ప్రక్రియను సులభంగా అభివృద్ధి చేసుకోగలుగుతారు. ఇది పరిశోధన, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది’’ అని అమిత్ షా అన్నారు.

Olena Zelenska: అత్యాచారాలు చేయమని భర్తలను ప్రోత్సహిస్తున్నారు.. రష్యన్ మహిళలపై జెలెన్‭స్కా సంచలన ఆరోపణ

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘మాతృభాషలో విద్యాభ్యాసం సులువు. దేశంలోని ప్రతిభావంతులు ఉన్నత విద్యలో చేరేందుకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. నేడు మన దేశంలోని 5 శాతం ప్రతిభను మాత్రమే ఉపయోగించుకోగలుగుతున్నాం. హిందీ లేదా ప్రాంతీయ భాషల్లో విద్యా బోధన జరిగితే, నూటికి నూరు శాతం ప్రతిభను ఉపయోగించుకోవచ్చు. ఈ 5 శాతం వ్యక్తులు ఆంగ్ల నేపథ్యం గలవారన్నారు. అయితే ఓ భాషగా ఆంగ్లానికి నేను వ్యతిరేకం కాదు. కానీ, మాతృ భాషలో చదివితే విద్యార్థి మౌలిక ఆలోచన సులువుగా అభివృద్ధి చెందుతుంది. ఇది పరిశోధనకు బలమైన పునాదిగా ఉంటుంది’’ అని అన్నారు.

Jack Ma: జపాన్‭లో తలదాచుకున్న జాక్ మా.. ఆరు నెలల తర్వాత తెలిసిన చైనా కుబేరుడి ఆచూకి

ట్రెండింగ్ వార్తలు