Prophet Row: ఆందోళనకారులకు ధీటుగా వ్యవహరించండి – ఇమామ్

ఢిల్లీలోని జామ మసీదులో శుక్రవారం ప్రార్థనల అనంతరం అల్లర్లు మొదలయ్యాయి. సస్పెన్షన్ కు గురైన బీజేపీ నేత నూపుర్ శర్మ, ఆమె మాజీ సహచరులు నవీన్ జిందాల్ మొహమ్మద్ ప్రవక్తపై చేసిన కామెంట్లకు గానూ..

Prophet Row: ఢిల్లీలోని జామ మసీదులో శుక్రవారం ప్రార్థనల అనంతరం అల్లర్లు మొదలయ్యాయి. సస్పెన్షన్ కు గురైన బీజేపీ నేత నూపుర్ శర్మ, ఆమె మాజీ సహచరులు నవీన్ జిందాల్ మొహమ్మద్ ప్రవక్తపై చేసిన కామెంట్లకు గానూ.. ఈ ఘటనలు జరిగాయి. నిరసనకారులెవరో తమకు తెలియదని షాహీ ఇమామ్ సయ్యద్ బుఖారీ అన్నారు.

“ఈ వ్యక్తులెవరో.. వారు ఏ రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్నారో తెలియడం లేదు” అని అన్నారు.

కొద్ది రోజుల క్రితం వివాదాస్పద వ్యాఖ్యలపై సస్పెండ్ చేయబడిన బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ అరెస్ట్ చేయాలని డిమాండ్ వినిపిస్తూ.. మసీదు మెట్లపై పెద్ద సంఖ్యలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రదర్శనలు సమంజసం కాదని, అనుమతుల్లేకుండా నిరసనలు చేయడం తగదని షాహీ ఇమామ్ అన్నారు.
Read Also: ప్రవక్తపై కామెంట్ల తర్వాత బీజేపీలో కొత్త రూల్స్

“ఇటువంటి ప్రదరర్శనలకు అనుమతి చాలా ముఖ్యం. ప్రస్తుతం ఇండియాలోని పరిస్థితులు చూస్తుంటే ఇటువంటి ప్రదర్శన సమంజసం కాదని అనిపిస్తుంది. ఇకపై ఎటువంటి నిరసనలు నిర్వహించినా.. అంతిమ నష్టం మాకే ఉంటుంది” అని సయ్యద్ అహ్మద్ బుఖారీ అన్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ట్రెండింగ్ వార్తలు