మోడీ సలహా : పబ్‌బీ గేమ్‌ను ఇలా ఫేస్ చేయండి

ఢిల్లీ: ఈ రోజుల్లో ఆన్‌లైన్ గేమ్స్ తాకిడి ఎక్కువైపోయింది. పిల్లలు ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలవుతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా గేమ్స్‌ ఆడేస్తున్నారు. దీంతో వారి చదువుపై తీవ్ర

  • Publish Date - January 29, 2019 / 09:51 AM IST

ఢిల్లీ: ఈ రోజుల్లో ఆన్‌లైన్ గేమ్స్ తాకిడి ఎక్కువైపోయింది. పిల్లలు ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలవుతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా గేమ్స్‌ ఆడేస్తున్నారు. దీంతో వారి చదువుపై తీవ్ర

ఢిల్లీ: ఈ రోజుల్లో ఆన్‌లైన్ గేమ్స్ తాకిడి ఎక్కువైపోయింది. పిల్లలు ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలవుతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా గేమ్స్‌ ఆడేస్తున్నారు. దీంతో వారి చదువుపై తీవ్ర ప్రభావం  పడుతోంది. స్టడీస్‌లో మెరుగ్గా రాణించలేకపోతున్నారు. పైగా ఆరోగ్య సమస్యలు కూడా ఫేస్ చేస్తున్నారు. చలాకీగా ఉండలేకపోతున్నారు. ఇక ఇటీవల వచ్చిన పబ్ జీ గేమ్.. పిల్లలపై తీవ్ర ప్రభావం చూపింది. వారిని హింసవైపు ప్రేరేపించడం తల్లిదండ్రుల్లో ఆందోళన నింపింది. ఇది ఏదో ఒక తల్లిదండ్రుల సమస్య కాదు.. దేశవ్యాప్తంగా పేరెంట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్.

 

ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్న ఓ విద్యార్థి తల్లి ప్రధాని మోడీ ముందు మొరపెట్టుకుంది. మా పిల్లాడు ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసైపోయాడు, చదువుల్లో వెనకబడ్డాడని ప్రదాని మోడీ ముందు ఆవేదన వ్యక్తం  చేసింది. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో మీరే చెప్పండి, నాకు మార్గదర్శనం చేయండి అని ప్రధాని మోడీని రిక్వెస్ట్ చేసింది.

 

24 రాష్ట్రాల్లో బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న 2వేల మంది విద్యార్థులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు  సమాధానాలు ఇచ్చారు. ఇదే సమయంలో ఓ విద్యార్థి తల్లి అడిగిన ప్రశ్నకు కూడా ఆయన సమాధానం ఇచ్చారు.

 

ఆ తల్లి ప్రశ్న అడిగి కూర్చుంది. వెంటనే మైక్ అందుకున్న మోడీ.. పబ్ జీ వాలా హై క్యా?(పబ్ జీ గేమా ఏంటి?) అని అన్నారు. అంతే ఒక్కసారిగా ఆడిటోరియంలో నవ్వులు విరబూసాయి. పిల్లలు, తల్లిదండ్రులు బిగ్గరగా నవ్వేశారు. పబ్ జీ లాంటి ప్రమాదకర ఆన్‌లైన్ గేమ్స్‌ను ఎలా ఫేస్ చేయాలి అనే దానికి ప్రధాని మోడీ విలువైన సూచనలు ఇచ్చారు. ఆన్‌లైన్ గేమ్స్ పెద్ద సమస్యగా మారింది అనేది వాస్తవమే అన్న ప్రధాని మోడీ.. దానికి  సమాధానం కూడా ఉందని చెప్పారు. ఆన్‌లైన్ గేమ్స్ సాకుతో పిల్లలను టెక్నాలజీకి దూరం చేయొద్దని తల్లిదండ్రులకు సూచించారు. అయితే పిల్లలు టెక్నాలజీ వాడుతూ రోబోల్లా మారిపోకుండా చూసుకోవాలన్నారు. వాళ్లపై ఓ కన్నేసి ఉంచాలన్నారు. టెక్నాలజీ, యాప్స్ వల్ల కలిగే లాభాలు, నష్టాల గురించి వారికి వివరించి చెప్పాలన్నారు.

 

టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలో పేరెంట్స్ వివరించాలన్నారు. అలా చేస్తే పిల్లలు దారితప్పకుండా ఉంటారని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. పిల్లలు ఆన్‌లైన్ గేమ్స్‌కు అడిక్ట్ అవుతున్నారనే కారణంతో టెక్నాలజీకి దూరం చేస్తే..  పిల్లలు వెనుకబడిపోతారని, అది కరెక్ట్ కాదని మోడీ చెప్పారు.