కరోనా వైరస్.. మూడు నెలల్లోనే యావత్ ప్రపంచాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది. మందుల్లేవంటూ ఐసోలేషన్‌లో వార్డుల్లో ఉంచి ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. శాస్త్రవేత్తలు మందు కనుగొనే పనిలో ఉంటే హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ గో మూత్రం దీనికి సరైన మందంటూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాదు, గో మూత్రంతో ఓ పార్టీ ఏర్పాటు చేసి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.
అఖిల హిందూ మహాసభ అధ్వర్యంలో ఢిల్లీలో ఈ పార్టీ జరిగింది. విందులో ఉన్న ఆహారం పదార్థాల కంటే ఎక్కువగా మట్టి కుండలో ఆవు మూత్రం, పింగాణీ పాత్రలో పేడ ప్రాధాన్యత దక్కించుకున్నాయి. ఈ పార్టీకి దేశ నలుమూలల నుంచి దాదాపు 200మందికి పైగా అతిథులుగా హాజరవ్వడం గమనార్హం. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఇలాంటి పార్టీలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట.
Gaumutra and Gobar Party!
Listen to these Hindu Mahasabha intellectuals claiming to treat everything from Coronavirus to Cancer! Height of Superstition! ?pic.twitter.com/8qtUDcEeMX
— Dhruv Rathee (@dhruv_rathee) March 14, 2020
గతంలో ఈ చక్రపాణి మహారాజ్.. ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కేరళలో వరద బాధితులకు సహాయం అందించేది లేదని వాళ్లు బీఫ్ తింటే ఎటువంటి సాయం అందుకోలేరని వ్యాఖ్యానించారు. ఈ పార్టీలో చాలా చేతులు.. వాటి నిండా ఆయుధాలు, సింహంతో ఉన్న తల ఫొటోను ఆవిష్కరించారు.
I was thinking if after drinking this bovine piss they still get the virus what will they do?
a. They will run to the hospital
b. They will cover themselves with gobar
c. They will start doing yoga
d. They will beat the crap out of gaumutra party organizer?? https://t.co/WFu5SCzJVM— Farhana (@FarhanaCvg) March 14, 2020
ఈయనతో పాటు అసోం బీజేపీ ఎమ్మెల్యే సుమన్ హరిప్రియ, భోపాల్ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ గో మూత్రం, ఆవు పేడతో కేన్సర్‌ను, ఇన్ఫెక్షన్‌ను నివారించవచ్చని వ్యాఖ్యానించారు.