రంగులు కాదు పూలు జల్లి హోలీ వేడుక జరుపుకున్నకిరణ్ బేడీ  

  • Publish Date - March 10, 2020 / 06:18 AM IST

పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీ హోలీ వేడుకలను వెరైటీగా జరుపుకున్నారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన హోలీ వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా  పాల్గొన్న కిరణ్ బేడీ రంగులకు బదులుగా పూలతో హోలీ చేసుకున్నారు. రాజ్‌భవన్‌ సిబ్బందిపై పూలు చల్లుతూ ఆమె ఎంజాయ్ చేశారు.

కాగా..కరోనా వైరస్ ప్రభావంతో రంగుల నీటికి బదులుగా ప్రజలు ఒకరిపై మరొకరు పూలు జల్లుకుని హోలీ పండుగను ఆనందంగా జరుపుకుంటున్నారు.దీంట్లో భాగంగా గుజరాత్ అహ్మదాబాద్ లోని జగన్నాథ్ దేవాలయంలో భక్తులు కూడా పాటలు పాడుతూ పూలు జల్లుకుని హోలీ పండుగను ఆనందంగా చేసుకున్నారు. బుట్టల కొద్దీ పూలు తెచ్చి పూలపండుగ జరుపుకున్నారు.