షాక్ నుంచి తేరుకుని విషాదంతో కోహ్లీ ట్వీట్

పుల్వామా ఉగ్రదాడి ఘటన విని యావత్ భారతమంతా షాక్‌కు గురైంది. పట్టపగలే నడిరోడ్డుపై దాడికి తెగపడి 37 మంది జవాన్ల ప్రాణాలను బలిగొన్న ఘటనతో భారతీయులంతా విచారం వ్యక్తం చేస్తున్నారు. కారు బాంబుతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)బలగాలపై జైష్ ఏ మొహమ్మద్ గ్రూపు టార్గెట్ చేసి మారణకాండ సృష్టించింది. జమ్మూకశ్మీర్‌లోని పుల్వమా జిల్లాలో గురువారం ఫిబ్రవరి 14న నమోదైన ఈ ఘటన కల్లోలం లేపింది. 

ఈ ఘటనపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గుండెల్లోని బాధను ఇలా బయటపెట్టాడు. ‘పుల్వామా ఘటన గురించి తెలియగానే షాక్‌కు గురైయ్యాను. అమరులైన వీరులకు నా సంతాపం తెలియజేస్తున్నాను. గాయానికి గురైన సైనికులు త్వరగా కోలుకోవాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను’ అంటూ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. 

ఈ ఘటనపై స్పందించిన క్రికెటర్లలో కోహ్లీ తొలి వ్యక్తేం కాదు. గౌతం గంభీర్, వీరేందర్ సెహ్వాగ్, మొహమ్మద్ కైఫ్‌లు అంతకంటే ముందు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ ఘటనకు ముందు కోహ్లీ ట్విట్టర్ అకౌంట్ నుంచి కొన్ని యాడ్‌లకు సంబంధించిన ట్వీట్లు పోస్టు అయ్యాయి. వీటి పట్ల నెటిజన్లు తీవ్రంగావిరుచుకుపడ్డారు. 37 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోతే నువ్వు చేసే పని ఇదేనా అంటూ విమర్శించారు. ఆ తర్వాత కాసేపట్లోనే వాటిని డిలీట్ చేసేసిన కోహ్లీ ఈ ట్వీట్ ను పోస్టు చేశాడు.

Also Read : 3 నెలల తర్వాత మళ్లీ మైదానంలోకి పృథ్వీ షా

Also Read : బిగ్ ఫైట్ : IPL ఫైనల్ చెన్నైలోనే

Also Read : ఐసీసీ ట్వీట్: సోలో లైఫే సూపర్.. సింగిల్‌గానే ఉండు

Also Read : హ్యాట్రిక్ సెంచరీలతో చరిత్ర సృష్టించిన హనుమవిహారీ