Free Gurbani Telecast Bill: పంతం నెగ్గించుకున్న భగవంత్ మాన్.. గోల్డెన్ టెంపుల్ గుర్బానీ బిల్లును ఆమోదించిన పంజాబ్ అసెంబ్లీ

గుర్బానీ అనేది పంజాబీలకు ఒక పవిత్రమైన శ్లోకం. స్వర్ణ దేవాలయంలో పఠించే ఈ శ్లోకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు ఎంతో భక్తితో వింటుంటారు. అయితే గుర్బానీ ప్రసార హక్కులు పీటీసీ అనే ప్రైవేట్ ఛానల్‭కు అప్పట్లో కట్టబెట్టారు. అయితే గుర్బానీని అందరికీ అందుబాటులో ఉండేలా ఉచితంగా ప్రసారం చేస్తామని ప్రకటించారు

Punjab Assembly: అమృత్‭సర్‭లోని స్వర్ణ దేవాలయం నుంచి వచ్చే గుర్బానీని ఉచితంగా అందరికీ అందుబాటులోకి ఉంచే విధంగా రూపొందించిన సిఖ్ గురుద్వారా సవరణ బిల్లు 2023ను మంగళవారం పంజాబ్ అసెంబ్లీ ఆమోదించింది. గురుద్వారా-1925 చట్టానికి చేసిన సవరణ బిల్లును సోమవారం పంజాబ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఈ చట్టాన్ని తీసుకువస్తామని ఆదివారం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించగానే సిక్కు సంఘాల నుంచి విపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

Cristiano Ronaldo: మరో మైలురాయిని చేరుకోనున్న స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ..

గుర్బానీ అంశాన్ని ఎస్జీపీసీ చూసుకుంటుందని, ప్రభుత్వానికి ఇందులో తలదూర్చే హక్కు లేదని శిరోమణి గురుద్వార పర్భందక్ కమిటీ (ఎస్జీపీసీ) హెచ్చరించింది. సిక్కు గురుద్వారా చట్టాన్ని పార్లమెంట్ చేసిందని, దానిలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేయలేదని భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు గుప్పించాయి. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ మాన్ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. అనుకున్న విధంగాగానే మంగళవారం బిల్లు పెట్టి అసెంబ్లీ ఆమోదం తీసుకుంది.

Minister KTR : ఎన్నికల్లో పైసలు ఇవ్వా,మందు పోయా,మీరు కోరుకుంటే సిరిసిల్లో ఉంటా : కేటీఆర్

గుర్బానీ అనేది పంజాబీలకు ఒక పవిత్రమైన శ్లోకం. స్వర్ణ దేవాలయంలో పఠించే ఈ శ్లోకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు ఎంతో భక్తితో వింటుంటారు. అయితే గుర్బానీ ప్రసార హక్కులు పీటీసీ అనే ప్రైవేట్ ఛానల్‭కు అప్పట్లో కట్టబెట్టారు. అయితే గుర్బానీని అందరికీ అందుబాటులో ఉండేలా ఉచితంగా ప్రసారం చేస్తామని ప్రకటించారు. దీనికి అనుగుణంగా గురుద్వారా-1925 చట్టాన్ని సవరిస్తామని ముఖ్యమంత్రి మాన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Alia Bhatt : రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహాని టీజర్ రిలీజ్.. అదిరేటి శారీల్లో అలియా భట్ అందాలు..

వాస్తవానికి గుర్బానీ హక్కుల్ని రాజకీయంగా శక్తివంతమైన బాదల్ కుటుంబానికి ఎస్జీపీసీ కట్టబెట్టింది. అయితే పీటీసీ గుత్తాధిపత్యాన్ని నియంత్రించేందుకే ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తాజా నిర్ణయం తీసుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు