Punjab : ప్రియురాలి కోసం గెటప్ మార్చావు సరే.. అసలు విషయం మరిచిపోయావుగా..!
అచ్చంగా ఇలాంటి సంఘటననే పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్‌కోట్‌లో చోటు చేసుకుంది.
- Thota Vamshi Kumar
- Published On : January 15, 2024 / 04:22 PM IST
Punjab man dresses as girlfriend to write test on her behalf caught
ఓ సబెక్టులో హీరోయిన్ చాలా వీక్. ఈ విషయం తెలిసిన హీరో.. అమ్మాయి వేషం వేసుకుని హీరోయిన్ స్థానంలో పరీక్ష రాసేందుకు వెళతాడు. ఎగ్జామ్ బాగా రాసి ఆమె పాస్ అయ్యేలా చూస్తాడు. ఇలాంటి సన్నివేశాలు అప్పుడప్పుడు మీరు సినిమాల్లో చూసే ఉంటారు. అచ్చంగా ఇలాంటి సంఘటననే పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్‌కోట్‌లో చోటు చేసుకుంది. అయితే.. సినిమాల్లోలాగా నిజ జీవితంలో జరగదు కదా.. అతడి ప్లాన్ బెడిసి కొట్టింది. ఇంకేముంది జైలు పాలు అయ్యాడు.
వివరాల్లోకి వెళితే.. జనవరి 7 ఆదివారం రోజున మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ పరీక్షను నిర్వహించారు. బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్‌సైన్సెస్ ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరిగింది. ఈ పరీక్ష కోసం పరమ్‌జిత్ కౌర్ అనే యువతి దరఖాస్తు చేసుకుంది. ఆమెకు కోట్కపురాలోని డీఏవీ పాఠశాలలో ఎగ్జామ్ సెంటర్ పడింది. ఆమె స్థానంలో ప్రియుడు ఫజిల్కాకు చెందిన అంగ్రేజ్ సింగ్ పరీక్ష రాయాలని నిర్ణయం తీసుకున్నాడు.
Viral Video : భార్య కోరికను తీర్చేందుకు.. 13,000 కిలోమీటర్లు తీసుకువెళ్లి..
పరీక్ష రోజున అతడు.. నుదుట తిలకం, పెదాలకు లిప్‌స్టిక్, ఎరుపు రంగు గాజులలతో పాటు లేడీస్ డ్రెస్ వేసుకున్నాడు. అచ్చం అమ్మాయిలా రెడీ అయి ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లాడు. అంతేనా ఎవ్వరికి అనుమానం రాకుండా ఉండేందుకు నకిలీ గుర్తింపులు కూడా తీసుకువెళ్లడంతో అధికారులు తొలుత అతడిని గుర్తించలేకపోయారు. అభ్యర్థుల దగ్గర ఇన్విజిలేటర్ బయోమెట్రిక్ తీసుకుంటూ అంగ్రేజ్ సింగ్ వద్దకు వచ్చాడు.
పరీక్షకు దరఖాస్తు చేసుకున్న సమయంలో ఇచ్చిన వేలిముద్రలతో అతడివి మ్యాచ్ కాలేదు. దీంతో సిబ్బందికి అనుమానం వచ్చింది. ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఈ విషయం తెలిసి పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులతో పాటు అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరంజిత్ కౌర్ దరఖాస్తును తిరస్కరించారు.
Viral Video : గ్యాస్ స్టవ్‌ను ఇలా వెలిగించాలని తెలియక.. ఎన్ని లైటర్లు కొన్నామో..!
