Viral Video : గ్యాస్ స్టవ్‌ను ఇలా వెలిగించాలని తెలియక.. ఎన్ని లైటర్లు కొన్నామో..!
ప్రపంచంలో ఏ మూలన ఏ ఘటన జరిగినా కూడా సోషల్ మీడియా ద్వారా క్షణాల్లో తెలిసిపోతున్నాయి.

Guy igniting gas stove by generating static energy
ప్రపంచంలో ఏ మూలన ఏ ఘటన జరిగినా కూడా సోషల్ మీడియా ద్వారా క్షణాల్లో తెలిసిపోతున్నాయి. ఇక రోజు ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని సరదాగా ఉంటే మరికొన్ని సృజనాత్మకతను కలిగి ఉంటాయి. ఇంకొన్ని ఆలోచింపజేసే విధంగా, మరికొన్ని ఆశ్చర్యపోయేలా ఉంటాయి. ఆశ్చర్యకరమైన వీడియోలు చూసిన సందర్భంలో మన కళ్లను మనమే నమ్మలేము. అలాంటి ఓ వీడియోనే ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
సాధారణంగా మనం గ్యాస్ స్టవ్‌ను వెలిగించాలంటే లైటర్ లేదా అగ్గిపెట్టెను వాడుతుంటాం. ఈ రెండింటి ద్వారా కాకుండా కేవలం చేతి వేలి ద్వారా మాత్రమే ఓ వ్యక్తి గ్యాస్ స్టవ్‌ను వెలిగించాడు.
దీని కోసం అతడు ఎలాంటి వస్తువులను వాడలేదు. వంట గదిలో కుర్చీపై కూర్చున ఓ యువకుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేశాడు. ఆ తరువాత తన కుడి చేతి వేలును బర్నర్ పై ఉంచాడు. మరో వ్యక్తి యువకుడి తలపై టవల్‌ను ఉంచి దానిని కొంచెం గట్టిగా లాగాడు. ఆ వ్యక్తి అలా చేసిన వెంటనే గ్యాస్ స్టవ్ మండడం ప్రారంభమైంది.
Haryana : వృద్ధుడికి తిరిగి ప్రాణం పోసిన గుంత.. ఈ వింత ఎక్కడ జరిగిందంటే?
ఈ వీడియో @Madan_Chikna అనే ఖాతా ద్వారా ఎక్స్‌లో షేర్ చేశారు. స్టాటిక్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం ద్వారా ఆ యువకుడు ఈ పనిని చేసినట్లుగా రాసుకొచ్చాడు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
Guy igniting gas stove by generating static energy ?
Truly, India is not for beginners ? pic.twitter.com/4eFVFF0esx— Godman Chikna (@Madan_Chikna) January 11, 2024