Haryana : వృద్ధుడికి తిరిగి ప్రాణం పోసిన గుంత.. ఈ వింత ఎక్కడ జరిగిందంటే?

రోడ్డుపై గుంతల్లో పడితే దెబ్బలు తగుల్చుకున్న సంఘటనలు గురించి విన్నాం.. కానీ ఓ గుంత వృద్ధుడికి తిరిగి ప్రాణాలు పోసింది. ఈ వింత సంఘటన ఎక్కడ జరిగిందంటే?

Haryana : వృద్ధుడికి తిరిగి ప్రాణం పోసిన గుంత.. ఈ వింత ఎక్కడ జరిగిందంటే?

Haryana

Haryana : దర్శన్ సింగ్ అనే పెద్దాయన అనారోగ్యంతో కన్నుమూసాడు. ఆయన శవాన్ని అంత్యక్రియల కోసం అంబులెన్స్‌లో తీసుకెళ్తుండగా అంబులెన్స్ కాస్త ఓ పెద్ద గుంతలో పడింది. ఆ కుదుపుకి పెద్దాయన పోయిన ప్రాణాలు తిరిగొచ్చాయి. ఇదేం విడ్డూరం అంటారా? హర్యానాలో జరిగిన ఈ సంఘటన అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

Rajasthan : బుల్లెట్ బండికి గుడి కట్టిన ప్రజలు.. ఈ వింత గుడి విశిష్టత ఏంటో తెలుసా?

ఓ గుంత పెద్దాయన పోయిన ప్రాణాల్ని తిరిగి తెచ్చింది. ఇదేం వింత అనుకున్నాం.. నిజం. హర్యానా కర్నాల్ జిల్లాలోని నిస్సింగ్ వాసి 80 ఏళ్ల దర్శన్ సింగ్ కొంతకాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం ఆయనను పాటియాలాలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు దర్శన్ సింగ్ చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ వార్త నిస్సింగ్ పట్టణం అంతా తెలిసిపోయింది.

నిస్సింగ్‌లో ఉన్న సంపన్న కుటుంబాలలో దర్శన్ సింగ్ కుటుంబం ఒకటి. ఆయన నివసించే కాలనీకి కూడా దర్శన్ సింగ్ కాలనీ అని పేరు పెట్టారట. దర్శన్ సింగ్ మరణ వార్తతో సంతాపం తెలిపేందుకు బంధువులు, స్నేహితులు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు కూడా చేసారు. సింగ్ చిన్న కొడుకు తండ్రి మృతదేహాన్ని పాటియాలా నుండి నిస్సింగ్‌కు తీసుకువస్తున్నాడు. ఈ సమయంలోనే అద్భుతం జరిగింది.

women fear : ఆడవాళ్లంటే భయంతో 55 ఏళ్లుగా ఇంటికి తాళం వేసుకుని జీవిస్తున్న 71 ఏళ్ల వింత వ్యక్తి

అంబులెన్స్‌లో సింగ్ మృతదేహాన్ని తీసుకువస్తుండగా కైతాల్‌లోని ధంధ్ ప్రాంతానికి వచ్చేసరికి అంబులెన్స్ టైర్లు ఓ భారీ గుంతలో పడటంతో ఒక్కసారిగా కుదుపుకు గురైంది. అదే సమయంలో సింగ్ శరీరంలో కదలికలు కనిపించాయి. చెక్ చేసి చూసేసరికి ఆయన గుండె కొట్టుకోవడం మొదలైంది. ఇక ఆయన కుమారుడు సంతోషంతో బాపూజీ అంటూ అరుపులు మొదలుపెట్టాడట. వెంటనే తండ్రిని నిస్సింగ్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచనతో ఆయనను మరో ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం దర్శన్ సింగ్ చికిత్స పొందుతున్నారు. హర్యానాలోని ఫతేహాబాద్‌కు చెందిన కార్డియాక్ ఫిజిషియన్ డా.వినీ సింగ్లా ప్రకారం సింగ్‌కు సంబంధించి ఇది అరుదైన కేసుగా చెప్పారు. సింగ్ ఆసుపత్రికి వచ్చిన సమయంలో వెంటిలేటర్‌పై ఉంచామని.. ప్రస్తుతం దాని అవసరం లేకుండా  ఆయన పరిస్థితి మెరుగుపడిందని  వెల్లడించారు. సింగ్ కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారు.  ఆ ప్రాంత ప్రజలు మాత్రం ఈ ఘటనను అద్భుతంగా చెప్పుకుంటున్నారు.