Rajasthan : బుల్లెట్ బండికి గుడి కట్టిన ప్రజలు.. ఈ వింత గుడి విశిష్టత ఏంటో తెలుసా?

చెట్లను పూజించడం.. జంతువులను పూజించడం చూసాం.. సెలబ్రిటీలకు గుడి కట్టడం కూడా చూసాం.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌‌కి గుడి కట్టి దేవతలా ఆరాధిస్తున్నారు అక్కడి ప్రజలు.. ఆశ్చర్యంగా ఉందా? చదవండి.

Rajasthan : బుల్లెట్ బండికి గుడి కట్టిన ప్రజలు.. ఈ వింత గుడి విశిష్టత ఏంటో తెలుసా?

Rajasthan

Rajasthan : సెలబ్రిటీలకు గుడి కట్టి పూజలు చేయడం చూసాం. కానీ బుల్లెట్ బండికి గుడి కట్టడం ఏంటి? ఆశ్చర్యంగా ఉంది కదా. రాజస్ధాన్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ కోసం ఓ పుణ్యక్షేత్రమే వెలిసింది. ఈ గుడి కట్టడం వెనుక ఆసక్తికరమైన కథనం చదవండి.

West Bengal : అయోధ్య ఆలయం కోసం రాముడి విగ్రహాన్ని తయారు చేస్తున్న ముస్లిం శిల్పులు

ఓం బన్నా పుణ్యక్షేత్రంగా భక్తులు పిలుచుకునే బుల్లెట్ బండి ఆలయం జోధ్‌పూర్ అహ్మదాబాద్‌లను కలిపే NH62 పై పాలి సిటీకి 53 కిలోమీటర్ల దూరంలోని చోటిలా గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో దేవత ఎవరనుకుంటున్నారు? RNJ7773 రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న 350 cc రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్. ఎవరైనా కొత్తగా బైక్ కొంటే చాలు ఈ గుడికి వస్తారు. ఇక రోడ్లపై బైక్ నడిపే తమ భర్తల భద్రత కోసం అనేకమంది స్త్రీలు ఇక్కడికి వస్తారు. మందిరంలో ఉన్న ఓ చెట్టుకి ఎర్రటి దారం కట్టి పూజలు చేసి వెళ్తారు. అసలు ఈ బుల్లెట్‌కి గుడి ఎందుకు కట్టారు? ఈ పూజలు ఏంటి ? అంటే దీని వెనుక ఓ ఆసక్తికరమైన కథనం ఉంది.

1988 లో ఓం సింగ్ రాథోడ్ అనే వ్యక్తి ప్రమాదంలో మరణించిన ప్రమాద స్థలంలో ఈ ఆలయం నిర్మించారు. అప్పట్లో పోలీసులు అతను నడిపిన బుల్లెట్ బైక్‌ను కస్టడీలోకి తీసుకున్నారట. మర్నాడు మిస్టరీగా ఆ బైక్ పోలీస్ స్టేషన్ నుండి అదృశ్యమై ప్రమాదం జరిగిన స్ధలంలోకి వచ్చిందట. పోలీసులు దానిని వెనుకకు తీసుకెళ్లినా మళ్లీ ప్రమాద స్థలం దగ్గరకే తిరిగి వచ్చేదట. దాంతో గ్రామస్తులు ఆ బైక్ కోసం ఒక మందిరాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అలా ఇక్కడ ఆ బుల్లెట్ బైక్ ఆలయ నిర్మాణం జరిగిందట. అప్పటి నుంచి అక్కడ ప్రమాదాలు జరగడం ఆగిపోయాయట. అక్కడ చనిపోయిన ఓం సింగ్ ఆత్మ ప్రయాణికులను కాపాడుతుందని గ్రామస్తులు నమ్ముతారు. పూజలు చేస్తున్నారు.

Ayodhya: రామయ్య ఆలయంలో బంగారపు పాలరాతి సింహాసనం!

చోటిలా గ్రామంలో ఉన్న ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. కొందరు హెల్మెట్లను విరాళంగా ఇస్తుంటారట. @aditya_kondawar అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఈ ఆలయం ఫోటోలు సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి.