West Bengal : అయోధ్య ఆలయం కోసం రాముడి విగ్రహాన్ని తయారు చేస్తున్న ముస్లిం శిల్పులు

అయోధ్య రామ మందిరం కోసం ఇద్దరు ముస్లిం కళాకారులు శ్రీరాముడి విగ్రహాలను తయారు చేస్తున్నారు. కళాకారులకు మతం లేదని నిరూపించిన ఆ తండ్రీ కొడుకులు ఎవరో చదవండి.

West Bengal : అయోధ్య ఆలయం కోసం రాముడి విగ్రహాన్ని తయారు చేస్తున్న ముస్లిం శిల్పులు

rama idols

West Bengal : త్వరలో ప్రారంభం కానున్న అయోధ్య రామ మందిరం కోసం ఇద్దరు ముస్లిం కళాకారులు శ్రీరాముడి విగ్రహాలను రూపొందిస్తున్నారు. హిందూ ముస్లిం భాయి భాయి అని రుజువు చేస్తున్న ఆ కళాకారులు తండ్రీ కొడుకులు కావడం విశేషం. వారి గురించి చదవండి.

Virat Kohli : అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు విరాట్ కోహ్లీ, అమితాబ్‌…8వేలమంది ప్రముఖులకు ఆహ్వానం

పశ్చిమబెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాకు చెందిన ఇద్దరు ముస్లిం శిల్పులు త్వరలో ఉత్తరప్రదేశ్ అయోధ్యలో ప్రారంభం కానున్న రామమందిర ప్రారంభోత్సవం కోసం రాముడి విగ్రహాలను రూపొందిస్తున్నారు. మహమ్మద్ జమాలుద్దీన్ అతని కుమారుడు బిట్టు ఆలయ సముదాయంలో అలంకరించడానికి ఈ అద్భుతమైన విగ్రహాలను తయారు చేసే పనిలో బిజీగా ఉన్నారు.

ఆన్‌లైన్ ద్వారా వీరికి అయోధ్య నుంచి రాముడి విగ్రహాల తయారీ ఆర్డర్ వచ్చిందట. వీరు తయారు చేస్తున్న విగ్రహాలు పూర్తిగా ఫైబర్‌తో తయారు చేయబడినవట.. ఒక్కొక్కటి రూ.2.8 లక్షలు పలుకున్న వీటి ధర ఎక్కువగా అనిపించినప్పటికీ వీటి నైపుణ్యాన్ని బట్టి సమర్ధతను అర్ధం చేసుకోవచ్చును. బంకమట్టితో పోలిస్తే ఫైబర్ ధర ఎక్కువ ఉన్నప్పటికీ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా బహిరంగ ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేయవచ్చని జమాలుద్దీన్ చెబుతున్నారు. ఇక మతం అనేది వ్యక్తిగత విషయం అనే .. భిన్నమతస్తులు ఉన్న మనదేశంలో అందరం కలిసి ఉండాలని.. రాముడి విగ్రహం తయారు చేయడం సంతోషంగా ఉందని.. కళకు మతం లేదనేది ఒక కళాకారుడిగా నా సందేశం అని జమాలుద్దీన్ చెప్పారు.

Ayodhya : అయోధ్య రామజన్మభూమిలో భారీ సాయుధ భద్రత.. ఎందుకంటే..?

జమాలుద్దీన్ గతంలో దుర్గమాత విగ్రహాలను కూడా తయారు చేశారట. అవి ఎంతగానో ప్రజాదరణ పొందాయట. కొన్నేళ్లుగా హిందూ దేవతల ఫైబర్ విగ్రహాలను తయారు చేస్తోంది జమాలుద్దీన్ కుటుంబం. ప్రస్తుతం వీరు రూపొందిస్తున్న రాముడి విగ్రహాలను అయోధ్యకు తరలించడానికి సుమారు 45 రోజులు పడుతుందని ఈ శిల్పులు చెబుతున్నారు.