Ayodhya : అయోధ్య రామజన్మభూమిలో భారీ సాయుధ భద్రత.. ఎందుకంటే..?

రామ జన్మభూమి అయిన అయోధ్య నగరంలో బుధవారం బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం సందర్భంగా భారీ సాయుధ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో స్థానిక అధికార యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసినట్లు యూపీ అధికారులు తెలిపారు....

Ayodhya : అయోధ్య రామజన్మభూమిలో భారీ సాయుధ భద్రత.. ఎందుకంటే..?

Ayodhya Security

Updated On : December 6, 2023 / 11:52 AM IST

Ayodhya : రామ జన్మభూమి అయిన అయోధ్య నగరంలో బుధవారం బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం సందర్భంగా భారీ సాయుధ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో స్థానిక అధికార యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసినట్లు యూపీ అధికారులు తెలిపారు. అయోధ్య పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. 1992వ సంవత్సరం డిసెంబరు 6వతేదీన బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు.

ALSO READ : Good news : వినియోగదారులకు శుభవార్త…కొత్త పంట రాకతో తగ్గిన కూరగాయల ధరలు

దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఈ హింసాకాండలో వెయ్యిమంది మరణించారు. అయోధ్య నగరానికి వెళ్లే వారిని సీసీ కెమెరాల ద్వారా పరిశీలించి వారి గుర్తింపు కార్డులను కూడా పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయోధ్యలోని పలు ప్రాంతాల్లో పోలీసులు వాహనాల తనిఖీలను కూడా ముమ్మరం చేశారు.

ALSO READ : Cyclone Michaung : తుపాన్ తీరాన్ని దాటినా ఆంధ్రా కోస్తా జిల్లాల్లో భారీవర్షాలు

బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం సందర్భంగా ప్రజలు ఎలాంటి పుకార్లను వ్యాప్తి చేయవద్దని అయోధ్య ఎస్పీ రాజ్ కరణ్ నయ్యర్ సూచించారు. అయోధ్య జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పోలీసు యంత్రాంగాన్ని మోహరించారు. సమీప జిల్లాల నుంచి పోలీసు బలగాలను కూడా అయోధ్యకు రప్పించారు.