Cyclone Michaung : తుపాన్ తీరాన్ని దాటినా ఆంధ్రా కోస్తా జిల్లాల్లో భారీవర్షాలు

మిగ్ జామ్ తుపాన్ తీరాన్ని దాటినా ఆంధ్రా కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో ఈ తుపాన్ ప్రభావం వల్ల గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి....

Cyclone Michaung : తుపాన్ తీరాన్ని దాటినా ఆంధ్రా కోస్తా జిల్లాల్లో భారీవర్షాలు

Cyclone Michaung

Cyclone Michaung : మిగ్ జామ్ తుపాన్ తీరాన్ని దాటినా ఆంధ్రా కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో ఈ తుపాన్ ప్రభావం వల్ల గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. భారీ గాలులు, కుండపోత వర్షంతో తుపాన్ బీభత్సం సృష్టించింది. ఈ తుపాన్ వల్ల పంటలు దెబ్బతిన్నాయి. భారీవర్షాల వల్ల రవాణా, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లకు అంతరాయం కలిగిందని ఆంధ్రా అధికారులు తెలిపారు.

ALSO READ : వాట్సాప్‌లో హెచ్‌డీ ఫొటోలను పంపొచ్చు

కోస్తా సముద్ర తీర ప్రాంత జిల్లాల్లో భారీ గాలులు వీస్తున్నా తుపాన్ ప్రభావం క్రమంగా బలహీనపడుతుందని రాష్ట్ర తుపాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు హెచ్చరించారు. పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల్లో మంగళవారం మధ్యాహ్నం కూడా భారీ వర్షం కురిసింది.

ALSO READ : Balakrishna : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ శుభాకాంక్షలు

మిగ్ జామ్ తుఫాను వల్ల మూసివేసిన చెన్నై విమానాశ్రయం తిరిగి కార్యకలాపాలు ప్రారంభించింది. ఆంధ్రా తీర ప్రాంతంలో పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. సహాయక బృందాలు నేలకూలిన చెట్లను తొలగిస్తున్నాయని ఆంధ్రా అధికారులు తెలిపారు. వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

ALSO READ : Chandrababu : ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం లెక్కలు వేసుకోకూడదు.. తుపాను బాధితుల్ని వెంటనే ఆదుకోవాలి : చంద్రబాబు

తుపాను సహాయక చర్యలు చేపట్టేందుకు ఒక్క బాపట్లలోనే 50 ప్రత్యేక బృందాలను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను బాపట్ల జిల్లాలోని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలకు తరలించారు. బాపట్ల జిల్లాలో 1,350 మందిని ముందుజాగ్రత్త చర్యగా 27 సహాయ శిబిరాలకు తరలించారు.